home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

జయ జయ సప్త గిరీశ్వర!


జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో !

1. ఫాలమునందున పట్టెపు నామములజ్జ్వలమైన త్రిశూలముగా |
నామమునందున ఈశ్వర శబ్దము నాభి కమలమున బ్రహ్మయదే |
వెరసి త్రిమూర్తులుగా నెలకొంటివి దేదీప్యమాన వైభవమై |
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో ! ||

2. తమ తమ పనులకు లంచములిచ్చెడి భక్త వేశ్యలకు మౌనముతో |
వజ్ర కిరీటము కనకాభరణములే కనిపించును నీ శిలలో |
స్వార్ధ విముక్తులు భక్తులు చూతురు నీ కరుణారస బాష్పములన్ |
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో ! ||

3. అన్నమయ్య యిట పాడుచు నెక్కుచు మెట్టు మెట్టునకు చూచెనుగా |
నవనవ సుందర రూపములెత్తుచు నెదురుగ కులికెడి నీ కళలన్ |
స్వార్ధ పూరితులు భక్తులు చూతురు కొండల బండల వృక్షములన్ |
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో ! ||

4. దిగి దిగి వత్తువు పద్మావతికై కొండరాళ్ళబడి గాయములై |
పదములు నిజముగ కమలములయ్యెను రక్త సిక్తములు ఎర్రనివై |
పద్మా ప్రణయము స్వార్ధ రహితమది నిర్మల గంగా వాహినియే |
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో ! ||

5. హే మధుసూదన ! హేమురమర్దన ! హే కంసాంతక ! దాశరధే ! |
హే పీతాంబర ! హే తులసీసర ! హే మురళీధర ! శాంతినిధే ! |
మంగా వల్లభ ! గోదా మోహన ! నాంచారీప్రియ ! వెంకపతే ! |
హే  శ్రుతి  శాస్త్ర  పురాణ  సమన్వయ  తత్త్వ  సుబోధక  దత్త గురో ! ||

 

 
 whatsnewContactSearch