Posted on: 11 Apr 2020
Read this article in: Hindi English
కరోనా విపత్తు నివారణపై పరమపూజ్య శ్రీ దత్తస్వామి దివ్యసందేశము
శ్రీ ఫణి:- ఈ భయంకరమైన వైరస్ కారణముగా ప్రపంచము ఎదుర్కొనుచున్న విపత్తులను ఎలా అధిగమించాలి?
శ్రీ ఫణి అడిగిన ప్రశ్నకు స్వామి ఇలా సమాధానమిచ్చారు:-
ఓ విజ్ఞులైన దత్త సేవకులారా! ఒక రాజు తన రాజ్యములో అనుసరించవలసిన నియమములను రూపొందించి ఆ నియమములను ప్రజలు అందరు తప్పకుండ పాటించాలి అని ఆదేశించారు. ప్రజలు ఆ నిబంధనను పాటించకపోతే వారు శిక్షింపబడతారు. కొంతమంది ప్రజలు ఈ నిబంధనను ఉల్లంఘించినారు. వారు రాజ్యములో ఉన్న ధర్మాసనము (court) చేత శిక్షింపబడినారు. ఇప్పుడు, ఈ నేరస్థులు రాజును అనేక విధములుగా స్తుతించినను, రాజు తన విశేష అధికారములను ఉపయోగించి వారి శిక్షను రద్దు చేస్తారా? రాజు ఏర్పరిచిన నియమాలను అనుసరించిన ప్రజలు రాజును ప్రశంసించకపోయినను శిక్షింపబడరు. అందువలన, రాజు ప్రశంసలతో సంబంధము లేకుండా, రాజు ఏర్పాటు చేసిన నిబంధనలను పాటించటము ఇచ్చట ప్రధాన విషయము. రాజుని భగవంతునితో, రాజ్యామును ప్రపంచముతో మార్పుచేసి చూసినచో, మీ ప్రశ్నకు సూటిగా సమాధానము లభిస్తుంది. భగవంతుడు తన రాజ్యాంగమును (ధర్మశాస్త్రము) ఋషుల ద్వారా మనకు వ్యక్తపరచినారు. ప్రతి జీవుడు ఆ భగవంతుని రాజ్యాంగమును (ధర్మశాస్త్రము) విధిగా పాటించవలెను. ఈ రాజ్యాంగము (ధర్మశాస్త్రము) ఎల్లప్పుడు పుణ్యకర్మలు ఆచరించమని పాపకర్మలు చేయవద్దని చెప్పుచున్నది. పుణ్యకర్మలు ఆచరించకపోయినచో, స్వర్గానికి వెళ్ళుట అను ప్రయోజనము ఉండకపోవచ్చును కానీ పాపకర్మలు చేసినచో వాటి తీవ్రతను అనుసరించి నరకములో వాటి ఫలములను అనుభవించుట లేక ఆ నరకయాతనను ఈ జన్మలో ఇక్కడే అనుభవించుట జరుగుతుంది (అత్యుత్కటైః పాప పుణ్యైః ఇహైవ ఫలమశ్నుతే). ప్రపంచములో మానవులు చేసిన తీవ్రమైన పాపముల పర్యవసానమే ప్రస్తుత ఈ విపత్తు. ప్రవృత్తి (ప్రాపంచిక జీవితము) అనగా పుణ్యము చేయుట మరియు పాపం చేయకపోవుట. నివృత్తి (ఆధ్యాత్మిక జీవితము) అనగా భగవంతుని స్తుతించుట. ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గము నిరోధించదు. ప్రవృత్తి మార్గము పూర్తిగా స్వతంత్రమైనది. దీనిలో నివృత్తి మార్గము ఎప్పుడూ జోక్యము చేసుకొనదు. ఒక వ్యక్తి నాస్తికుడైనప్పటికి, ప్రవృత్తిని సరిగా పాటించినచో ఆ నాస్తికుడు కూడా ఖచ్చితముగా ప్రస్తుత విపత్తు వంటి శిక్షలను నివారించుకొనవచ్చు. ఈ సృష్టిలో ఆస్తికుడా లేక నాస్తికుడా అనే భేదము లేకుండా సర్వజీవులనుండి భగవంతుడు పూర్తిగా లేక కనీసముగా ఆశించుచున్నది సరి అయిన ప్రవృత్తి మాత్రమే.
ఏ దేశ ప్రజలైన భగవంతుని విశ్వసించినా లేక విశ్వసించకపోయినా భగవంతుని ప్రస్తావనలేకుండా కూడా ఈ క్రింది విధముగా ప్రార్థిస్తే ఆ దేశము ఈ విధమైన విపత్తులనుండి రక్షింపబడుతుంది.
“సమాజములో పుణ్యకర్మలు ఆచరించుట మరియు ఎక్కువగా పాపకర్మలు చేయకపోవుట అనునది ప్రచారము చేద్దాము. ఈ ధర్మాచరణ అను జ్ఞానమును పదేపదే ప్రచారము చేయుట ద్వారా ఈ భావనను నేను అలవరుచుకొనుట మాత్రమే కాక నా చుట్టూ ఉన్న సమాజము కూడా ఈ భావనను జీర్ణించుకొనుటకు దోహదపడుతుంది. ఈ జ్ఞానము నా సంస్కరణకు ఉపయోగపడుటయే కాక నా చుట్టూ ఉన్న సమాజ సంస్కరణకు కూడా ఉపయోగపడుతుంది. దీనివలన పాపకర్మల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అంతేకాక నాతోసహా ఈ సమాజములోని వ్యక్తులందరూ పాపతీవ్రతను తగ్గించుటకు హృదయపూర్వకముగా ప్రయత్నము చేస్తారు.”
భగవంతుని గురించి ప్రస్తావన లేకపోవుట వలన పూర్తిగా నాస్తికులతో నిండిన దేశములైనా ఈ భావనను ప్రచారము చేయవచ్చు. కానీ నాస్తికులు కూడా అనివార్యమైన పాపకర్మఫలముల తీవ్రతను ప్రకృతి సహజ ప్రకోపము ద్వారా అనుభవించవలెనని అంగీకరించక తప్పదు.
మూడు ప్రధానమైన పాపములను గురించి గీతలో ఈ విధముగా చెప్పబడినది ("కామః క్రోధః తథా లోభః"): -
అంతిమ అవతారమైన కల్కిభగవానునికి ఈశ్వరుని ద్వారా లభించిన విద్యుత్ ఖడ్గము ప్రస్తుత వైరస్ వేగము కంటే అనూహ్యమైన వేగముతో చాలా వరకు మానవాళిని నశింపచేస్తుంది. ఆ ఖడ్గ వేగము ఈ వైరస్ వేగము కంటే కోటిరెట్లు ఎక్కువగా ఉంటుంది.
[ఈ దివ్య సందేశమును ప్రతి వ్యక్తికి చేరేలా చూసుకోవడము మనందరి సామూహిక బాధ్యత. ఈ సందేశమును మీకు తెలిసిన వారందరికి పంపించండి మరియు అన్ని సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ప్రచారము చేయండి. దీనితో ఈ మహమ్మారి అంతము మాత్రమే కాక, మీరు భగవంతుని అనూహ్యమైన కరుణకు పాత్రులు కాగలరు.]