Showing 1 – 20 of 201 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
Updated with Part-2 on 04 Nov 2025
Part-1: [16.12.2002] నారాయణుడు అనగా ఎవరు? "నారం అయనం యస్య సః నారాయణః" అనగా నారమును ఆశ్రయించిన వాడు నారాయణుడు. "నారము" అనగా ఏమి? నరునకు సంబంధించినదే నారము. నరుడు అనగా అర్థమేమి? ‘‘న రీయతే క్షీయతే ఇతి నరః’’ అనగా నశించని వాడు నరుడు అని అర్థము. నరునకు బాహ్య శరీరము ఉన్నది. దాని యందు వ్యాపించిన చైతన్యము అను జీవుడున్నాడు. శరీరము నశించినను జీవుడు నశించక పరలోకమునకు పోవుచున్నాడు. కావున జీవుడు నిత్యుడు...
For ScholarsPosted on: 31/10/2025Updated with Part-3 on 02 Nov 2025
[30-01-2003] Part-1: ఒకే పరమాత్మ భారతదేశములో గురుత్రయ స్వరూపములలో శంకర, రామానుజ, మధ్వాచార్యుల రూపాలలో అవతరించి బోధించిన బోధలలో అనగా వారు వ్రాసిన భాష్యములలో తేడాలు ఉండుటకు రెండు కారణములున్నవి. మొదటి కారణము పరమాత్మ శంకరాచార్య రూపములో వచ్చినపుడు ఉన్న సాధకుల స్థాయి చాలా దారుణముగ యున్నది. అప్పుడు ఉన్న సాధకులు పూర్వ మీమాంసకులు మరియు బౌద్ధులు. ఈ ఇరువురును నాస్తికులే. పూర్వ మీమాంస "దేవో న కశ్చిత్" అనుచున్నది...
Updated with Part-2 on 30 Oct 2025
Part-1: [09.03.2000 ఉదయం 6 గంటలకు]
బ్రహ్మోఽహం బ్రహ్మదేవోఽహం, బ్రాహ్మణోఽప్యహమేవ చ |
ఇతి మాం యో విజానాతి, బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే ||
అనగా–బ్రహ్మము నేనే. బ్రహ్మదేవుడను నేనే. బ్రాహ్మణుడన్నను నేనే. ఇట్లు నన్ను ఎవరు తెలుసుకొందురో వారే బ్రహ్మజ్ఞానులు. ‘ఏకమేవా ఽద్వితీయం బ్రహ్మ – నేహ నానాస్తి కించన’ అని శ్రుతి. అనగా బ్రహ్మ ఏకము. నానాత్వము (multiplicity) లేదు అని అర్థము. ఏకత్వమును అర్థము చేసుకొనక, జాతి...
For ScholarsPosted on: 27/10/2025Updated with Part-2 on 28 Oct 2025
Part-1: [21-12-2002] శ్రీ దత్త భగవానుడు శంకరులుగా అవతరించినపుడు ఈ దేశమంతయును నాస్తికులతో నిండియుండెను. ఈ నాస్తికులు రెండు విధములుగా యుండిరి. మొదటి విధము వారు పూర్వమీమాంసకులు. వీరు యజ్ఞయాగాదులను మాత్రమే చేయుచు భగవంతుడులేడని వాదించుచుండిరి. వీరి మతము ప్రకారముగా "దేవో న కశ్చిత్ భువనస్య కర్తా" "కర్మానురూపాణి పురఃఫలాని" అనగా ఈ జగత్తు లేక ఈ శంకరుడును లేడు లేడు. వేదములో చెప్పబడిన యజ్ఞములను చేసినచో మనము
Updated with Part-2 on 26 Oct 2025
[17-12-2002] Part-1: శిష్యుల యొక్క సాధన స్ధితిని బట్టి ఏది చెప్పవలయునో, ఎచ్చట ఆరంభించవలయునో, ఎచ్చట ముగించవలయునో, ఎట్లు చెప్పవలయునో శ్రీ దత్త సద్గురునికి మాత్రమే బాగుగా తెలియును. శిష్యుడు ఉన్న మెట్టు నుండి పైకి ఎక్కవలసిన మెట్టును గురించి మాత్రమే సద్గురువు బోధించును. ఎక్కడో దూరముగ నున్న చిట్టచివరి మెట్టు గురించి బోధింపడు. అట్లు బోధించినచో ప్రయోజనము లేకపోగా శిష్యుడు ఉన్న మెట్టునుండి భ్రష్టుడగును. ఇది గురుబోధలో ఎంతో ముఖ్యమైన విషయము...
Updated with Part-2 on 24 Oct 2025
Part-1: [07.02.2003 శుక్రవారము] ఒక బిందెలో బురద నీరు ఉన్నది. మరియొక బిందెలో సుగంధ జలమున్నది. మరియును సుగంధ జల సముద్రము కూడ యున్నది. బురద నీరు ఉన్న బిందెలోను సుగంధ జలము ఉన్న బిందెలోను, సుగంధ జల సముద్రములోను శుద్ధమైన నీరు ఉన్నది. బురద నీటి బిందెయే జీవుడు. సుగంధ జలమున్న బిందెయే సాధన చేత జీవ గుణములు పోగొట్టుకొని కల్యాణ గుణములను పొందిన జీవుడు...
Updated with Part-2 on 22 Oct 2025
Part-1: [11-12-2002] శ్రీ దత్తుని శివస్వరూపమే శంకరులుగా అవతరించినది. అప్పటి పరిస్థితులు చాలా దారుణముగా ఉండెను. అందరును భౌద్ధమతమును స్వీకరించిరి. బుద్ధుడు కూడా దత్తావతారమే. బుద్ధుడు అవతరించిన సమయమున తత్త్వవిచారణ లేక కేవలము యజ్ఞములను చేయుచు యజ్ఞములలో పశువులను వధించుచున్న రోజులవి. బుద్ధుడు పశువధలనే కాక యజ్ఞములను కూడ మాన్పించినాడు. ఏలననగా...
For ScholarsPosted on: 19/10/2025[16-12-2002] బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్థము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్థములలో అన్నింటికన్న గొప్పది చైతన్యము. ఈ చైతన్యమునే “చిత్”, "చిత్తము", "జీవుడు", "క్షేత్రజ్ఞుడు", "శరీరి", "దేహి", "ఆత్మ" మొదలగు శబ్దములచే పండితులు పిలచుచున్నారు. చైతన్యము అన్నింటి కన్న గొప్పది అగుటకు కారణమేమనగా జడపదార్థము చేయలేని కొన్ని పనులను చైతన్యము (awareness) చేయుచున్నది. చైతన్యము చేయు పనిని బట్టి ఆ చైతన్యమే వేరు వేరు పేరులను...
[27-01-2003] "బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః" అని గీత. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ నరాకారము పరబ్రహ్మమని విశ్వసించు నిశ్చల జ్ఞానము, అనేక జన్మల తపస్సాధన వలన అసూయను పోగొట్టు కొని అనసూయా తత్త్వమును పొందిన ఒకానొక అతిదుర్లభ జీవునకే లభించునని అర్థము. "నాహం ప్రకాశః సర్వస్య యోగ మాయా సమావృతః" అని గీత. నేను మాయచే కప్పబడి యున్నందున అందరు గ్రహించలేరని...
Updated with Part-2 on 17 Oct 2025
Part-1
[01-01-2003] ధనము నీ శక్తి యొక్కయు, నీ సమయము యొక్కయు స్వరూపమై యున్నది. నీ కాలము, శక్తి వ్యయించబడి ధనముగా మారినది. కావున ధనమును దుర్వినియోగము చేసినచో నీ కాల శక్తులను దుర్వినియోగము చేసినట్లే. నీవు భగవంతునికి అర్పించదలచిన ధనము సద్వినియోగము చేసినచో సత్ఫలితమును పొందెదవు. నీవు ధనమును దైవ పూజకు వ్యయించుచున్నావు. పూజ అనగా షోడశోపచారములు ఇంకను రాజోపచారాది అనేక ఉపచారములు. ఉపచారములు...
Updated with Part-2 on 15 Oct 2025
Part-1: [04.02.2003] జీవుడు ఒక బురద నీటి పాత్రవలె ఉన్నాడు. పాత్ర జడ శరీరముగను నీరు శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము అగు జీవుడు. ఈ జీవుడే ఆత్మ దేహి శరీరి పురుషుడు, క్షేత్రజ్ఞుడు, పరా ప్రకృతి అను శబ్దములచే చెప్పబడుచున్నాడు. ఈ బురద నీటిలో యున్న మట్టికణములే జీవస్వభావ గుణములు అగు అహంకార మాత్సర్యాదులు. ఇక ఒక సుగంధ నీటి మహా సముద్రమే ఈశ్వరుడు. ఈ సుగంధ జలములోని నీరే శుద్ధ చైతన్యము. బురద నీటిలోని శుద్ధ జలము...
Updated with Part-2 on 13 Oct 2025
Part-1: రామావతారమున కౌసల్యాగర్భమున చేతనమైన శరీరపిండము ఏర్పడినది. ఈ శరీరపిండములో అనేక జన్మ సంస్కార వాసనా రూపమైన విశిష్టజీవుడు లేడు. కేవలము సామాన్య చైతన్యమైన జీవస్వరూపము ఉన్నది. ఈ సామాన్యచైతన్యము సామాన్య జీవస్వరూపమే అనవచ్చునే తప్ప విశిష్టచైతన్య స్వరూపమనరాదు. ఈ సామాన్య చైతన్య స్వరూపములో కేవలము చైతన్యము ఎట్టి మలినములు లేని శుద్ధ జలము వలె నుండును...
[12.03.2003] సౌందర్యము అనునది ఒక కల్యాణగుణము. సౌందర్యము యొక్క ముఖ్యమైన స్థానము ముఖము. ముఖము మనస్సునకు అనుగుణముగా యుండును. అందుకే "face is the index of the mind" అన్నారు. జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు కల్యాణగుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు కల్యాణగుణములతో పరిపూర్ణమైనపుడు ముఖము నందు సౌందర్యము పరిపూర్ణమగును...
[13.02.2003] బ్రహ్మ సత్యము. జగత్తు మిథ్య. జీవుడు బ్రహ్మమే అని అన్నారు శంకరులు. దీని అర్థము బ్రహ్మము జీవుడు, బ్రహ్మము సత్యము కాన జీవుడు సత్యము. జగత్తు మిథ్య అనగా దాదాపు అసత్యమే అని అర్థము. బ్రహ్మము యొక్క ఊహయే ఈ జగత్తు. ఒక వ్యక్తితో పోల్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఊహ దాదాపు లేనట్లే. ఒక వ్యక్తి విశాలమైన మైదానమున ఉన్నాడు. అతడు తన ఎదురుగా ఒక గోడ వున్నట్లు ఊహించుకొన్నాడు...
Part-1: [మహాశివరాత్రి సందేశము] జ్ఞానము బ్రహ్మ, ప్రేమ విష్ణువు, ఆనందము శివుడు. ఇదే త్రిమూర్తితత్త్వమైన వైదిక కళ్యాణగుణ సంపద. ఈ మూడు గుణములచేత త్రిమూర్తిస్వరూపుడైన గురుదత్తుని సులభముగా గుర్తించవచ్చును. కాని పామరులు, అష్టసిద్ధులగు మహిమల ప్రదర్శనము ద్వారా గురువుగా, దైవముగా గుర్తించుచున్నారు. ఈ పామరజనులు శిశువుల వంటివారు. ఎవడు కిరీటము ధరించి రాజువేషములో వచ్చునో, వాడినే రాజుగా తలచు అజ్ఞానులు. ఈ సిద్ధులు కొన్ని యంత్ర...
"జీవుడు స్వామి కన్న వేరు, దాసుడే" నన్న మాటను జీవునిచేత పలికించుటకు స్వామికి శంకర రామానుజ మధ్వావతారములు అను మూడు అవతారములు పట్టినవి. గురువు చెప్పిన మాటనే శిష్యుడు పలుకును. శంకరులు తానే దేవుడనని సత్యము చెప్పగా, శిష్యుడు తానూ దేవుడననే అన్నాడు. ఆనాడు అందరూ నాస్తికులే. దేవుడు లేడు అంతా శూన్యమేనని బౌద్ధులు, సృష్టి మాత్రమే ఉన్నది సృష్టికర్త లేడు అని పూర్వ మీమాంసకులు అను రెండు తెగలుగా నాస్తికులున్నారు. వారి చేత ముందుగా...
Updated with Part-2 on 05 Oct 2025
Part-1: శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించువాడు అని అర్థము. ఆయన యొక్క అంతఃస్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైనవాడు అని అర్థము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము ఆనాటి వ్రజభాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా...
[21-05-1997 11.00 am] నీవు చింతించకుము. నాపై పూర్ణ విశ్వాసము ఉంచినవాడు ఎవ్వడునూ చింతించడు-శోకించడు. ఏలననగా నేను వానిని సదా రక్షింతునని అచంచల విశ్వాసము వానికి కొండవలె హృదయములో స్థిరముగా నిలచియుండును. నన్ను విశ్వసించినను, విశ్వసించకపోయినను కర్మఫలభోగము ఎవ్వరికిని తప్పదు. అయితే నా భక్తుడు కర్మఫలములను అనుభవించుచు వాటి ద్వారా అహంకార మమకారములను త్రెంచుకొని, జ్ఞానమును పొంది, ఉద్ధరింపబడి...
Updated with Part-2 on 02 Oct 2025
Part-1: హనుమంతుడు సంజీవి పర్వతమును ఎత్తినపుడును కృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తినపుడును, ఈ రెండు సన్నివేశములలో గల తేడాను మనము గుర్తించినచో, జీవేశ్వరుల తేడాను మనము తెలుసుకొనగలము. బ్రహ్మ సూత్రములలో "అనుపపత్తేస్తు న శారీరః" ఇత్యాది సూత్రములలో శంకరులు కూడ జీవేశ్వరులకు గల బేధమును స్థాపించినారు. హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు తన శరీరమును పర్వతము కన్న ఎక్కువ ప్రమాణములో పెంచి యున్నాడు. అంత పెద్ద పరిమాణము...
[05.12.2003] భక్తియోగములో ఉన్మాదము తొమ్మిదవ అవస్థ. అట్టి ఉన్మాదములో ఎట్టి కర్మయు ఆచరించలేరు. దీనినే కర్మసంన్యాస యోగము అందురు. రాధ ఇట్టి కర్మసంన్యాస యోగమను ఉన్మాదదశ పొంది అత్యుత్తమ ఫలమును పొందినది. ఉన్మాదావస్థ స్వయముగా వచ్చిన మంచిదే కాని, దాని కొరకు ప్రయత్నించనక్కరలేదు...