24 Feb 2025
[25-04-2004 ఉదయం 7 గంటలకు] రామానుజులు కులాభిమానమును జూపిన భార్యను త్యజించినారు. పరకుల ద్వేషము లేక, నారాయణ మంత్రమును అందరికిని అన్ని కులములకును ఉపదేశించినారు. కులాభిమానమే పోనిచో ఈ కుటుంబము వరకే నాది అన్న కుటుంబాభిమానము ఎట్లు పోవును? అది పోనిచో దేహాభిమాన మెట్లు పోవును? అదియును పోనిచో ఆత్మాభిమాన మెట్లు పోవును? అభిమానము అనగా అహంకారముతో కూడిన మోహము. ఈశ్వరునకు ఆత్మను శరణాగతి చేయుట భక్తియనియు, దేహమును శరణాగతి చేయుట ప్రపత్తియనియు అర్థము. భక్తి, ప్రపత్తులనే సేవయని శ్రీ మధ్వులు చెప్పిరి. కావున కుల, కుటుంబ, దేహ, ఆత్మ వ్యామోహములు నశించి ఆ వ్యామోహము ఈశ్వరునిపై ఏర్పడి అహంకారము పూర్తిగ తొలగినవాడే నిజమైన సంన్యాసి. అట్టి సంన్యాసికే మోక్షము కరతలామలకమై యుండును.
★ ★ ★ ★ ★