home
Shri Datta Swami

 12 Dec 2024

 

శ్రీమధ్వాచార్యుల వారు - ద్వైతసిద్ధాంతము

నేను బ్రహ్మదేవుడనైన శ్రీమధ్వాచార్యుడను. నిప్పురవ్వ యొక్క ఉనికి అత్యల్పమైననూ, ఉన్నది. అయితే దానిలోని దాహగుణము చాలా తక్కువ కాన దాదాపు లేనట్లే. అంటే అది బూడిదగుణముగా తీసుకొనవచ్చును. కాన మహాగ్ని కంటే పూర్తిగా భిన్నమైన ధర్మము కలది కాన, మహాగ్ని చుట్టూ ఉన్న బూడిద మహాగ్నికి శరీరము కాదు. భిన్న ధర్మముతో, వేరుగా జగత్తు ఉన్నది. ఇది ద్వైతమతము. సాధన లేకుండా జీవుడు బ్రహ్మమునకు భిన్నముగా దూరముగా ఉన్నవాడు అనుట ద్వైతము.

Swami

సాధన వలన జీవుడు బ్రహ్మమునకు సేవకుడగుట ద్వైతము. బ్రహ్మమునకంటె భిన్నమైన జగత్తు ఉన్నది. బ్రహ్మ భిన్నుడైన జీవుడున్నాడని రామానుజ, మధ్వమతములు. ఎటూ సత్యమైన పరమాకాశమున్నది. కాన దానిపై ఆధార పడియున్న వస్తువులగు జగత్తు, జీవుడు బ్రహ్మమునకు దూరముగనే యున్నారు. అంటే శరీరము వలె, విడదీయుటకు వీలు కానివి కావని మధ్వమతభావము. కుమ్మరి వాడు, మట్టి వేరుగా ఉన్నట్లు రామానుజమతములో విడదీయుటకు వీలు కాని జీవుడు, శరీరము వలె బ్రహ్మము – జగత్తు ఉన్నవి. ఈ ప్రపంచము బ్రహ్మము యొక్క ఊహ. నశించునది కావున శరీరము అనబడును. బ్రహ్మము నిత్యము కాన శరీరము కన్న వేరు. ఇదే ద్వైతమతసిద్ధాంతము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch