home
Shri Datta Swami

 08 Apr 2025

 

లక్ష్మణ గీతాసారము

[The following is the essence of the Lakshmana Giita preached by Shri Swami. (Click here)]

పరమాత్మ జ్ఞాన-ప్రేమానంద స్వరూపుడు. జ్ఞాన-ప్రేమానందముల ఘనమే (solidified i.e., personified) పరబ్రహ్మము. పరబ్రహ్మము అనంతము. పరబ్రహ్మము యొక్క శక్తియే మాయ. మాయ జీవుని ఊహలకు అందరానిది. మాయ రహస్యము పరమాత్మకే తెలియును. అందువలననే జీవుడు పరమాత్మకు ‘దాసోఽహం’ అని శరణాగతి చేయవలసియున్నది. ఈ మాయతోనే పరమాత్మ ఈ విశ్వమును నిర్మించినాడు. ఈ చలనచిత్రము వంటి విశ్వము పరమాత్మకు వినోదము నిచ్చుచున్నది. ఇది పరమాత్మకు మేల్కొని కనులు తెరచినప్పటి కల (daydream) వంటిది. జీవులతో సహా ఈ విశ్వమంతయును పరమాత్మలో అత్యల్పకణమై దాదాపు లేనిదే అని తెలసికొనవలయును. పరమాత్మ జ్ఞాన-ప్రేమానందముల మహాసాగరము. బ్రహ్మము అంటే నీరు అయితే, ఈశ్వరుడు సముద్రము. జీవుడు బ్రహ్మమే కాని ఈశ్వరుడు కాడు. జలధియు మరల బిందువు కూడ తానే అయినట్లు పరమాత్మ దేవుడును నరుడును కూడ తానే అగును. ఇదే నరావతారము. ఈ నరావతారమే పరబ్రహ్మము అనబడును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch