home
Shri Datta Swami

 19 Nov 2024

 

ఆధ్యాత్మిక సాధనలోని ప్రధాన అంశములు

1. వర్తమాన దత్తావతారుని గుర్తించుట. భగవంతునికి అత్యధికమైన విలువ నిచ్చుట.

2. అట్టి నరావతారునికి సర్వస్వశరణాగతి చేసి, ఆయన కార్యములో నిష్కామముగా పాల్గొని పరిపూర్ణ విశ్వాసముతో సేవించుట.

3. సద్గురువు వాక్యములను శ్రద్ధగా శ్రవణము చేసి పదిమందికి ఈ దివ్యజ్ఞానమును పంచుట.

4. గృహస్థునకు కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము రెండూ అవసరమని తెలసికొని ఆచరించుట.

5. ఆచరణయే విశేష ఫలమని గ్రహించుట.

6. జ్ఞానము, భక్తి ఉపకరణములని, కర్మయే ఫలప్రదమని తెలసికొని ఆచరించుట.

7. సద్గురువు లభించుట చాలా కష్టం, ఎన్నో జన్మలలో ఎన్నో కర్మలు అనుభవించిన తరువాత గానీ, సద్గురువు లభించడు. కాని ఆయననుండి దూరమవటానికి ఒక్క క్షణము చాలును. కనుక విశ్వాసం ఏమాత్రమూ సడలరాదు.

8. సద్గురువు కృపతోనే సంసారసాగరం దాటడము సాధ్యము.

9. పరిపూర్ణనమ్మకంతో ఉన్నవారికి, సద్గురువు ఎప్పుడూ సన్నిధిలోనే ఉంటాడు.

10. కర్మఫలత్యాగపరీక్షను స్వామి నరరూపములోనే చేయును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch