home
Shri Datta Swami

 01 Apr 2025

 

పరబ్రహ్మము ఊహాతీతము

[01.10.2003] పరబ్రహ్మము ఊహాతీతము (unimaginable). ఈ పరబ్రహ్మమును గుర్తించే స్వరూపలక్షణాన్ని (inherent characteristic) వేదము ఇలా చెప్పుచున్నది. దేని నుండి ఈ సమస్త భూతములు పుట్టి, దేని చేత నిలచి, దేని యందు లయము చెందుచున్నవో అదే పరబ్రహ్మము. అది ఏకైక స్వరూపము, అద్వితీయము. సర్వదేవతలు దత్తబ్రహ్మము యొక్క వేషములు మాత్రమే – "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ" అని శ్రుతి. అనగా బ్రహ్మము ఒక్కటే. దానికంటే, రెండవది లేదు. ఆ పరబ్రహ్మము ఏకాకిగా ఉండి ఆనందమును పొందుటకు రెండవ రూపమును ఇచ్ఛగించెను. "ఏకాకీ న రమతే స ద్వితీయమ్ ఐచ్ఛత్" అని శ్రుతి. కనుక ఆ పరబ్రహ్మము తన ఆనందము కొరకు రెండవ వస్తువును (creation or universe) సంకల్పించెను. పరమాత్మ సంకల్పసిద్ధుడు. కనుక, సంకల్పించగనే అది రూపమును ధరించును. అదియే సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయమునకు శివుడు. ఇవి వేషములే కాని రూపములు కూడా కాదు. అట్లే పరమాత్మ యొక్క ఒక్కొక్క గుణము ఒక్కొక్క దేవతగా అవతరించెను. ఈ విధముగా 33 కోట్ల దేవతలు అవతరించిరి. కనుక పరబ్రహ్మము ఒక్కటేననియు, రెండవనిది లేదనియు, దేవతలందరు పరబ్రహ్మము యొక్క వేషములేననియు తేలినది. అందుకే, "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ" అని శ్రుతి చెప్పుచున్నది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch