home
Shri Datta Swami

 02 Mar 2025

 

శ్రీ దత్తవాణి

[22-03-2004] ఎన్నో సంవత్సరముల నుండి ఎందరో పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయములను నేను బోధించు ఈ జ్ఞానము తప్పక తుడిచి వేయగలదు. ఏలయనగా నేను బోధించు జ్ఞానము సత్యమేనని నీవు నీ వివేకముతో నిశ్చయించు కొనగలిగినచో వారి యొక్క అసత్యమైన జ్ఞానము వారు ఎంతమందియైనను ఎన్నేళ్ళ నుండి చెప్పుచున్నను సత్యము కాదు కదా.

ఒక ఖాళీ గదిలో 100 కుండలు ఉన్నవియను అసత్యమును వందమంది 100 సంవత్సరముల నుండి చెప్పుచున్ననూ అది సత్యము కాదు గదా. నేను ఒక్కడినే ఒక గంట క్రింద ఆ గదిలో ఒక్క కుండ కూడా లేదని చెప్పినప్పటికిని నేను చెప్పినదే సత్యము కదా. ఏలయనగా నిజముగా ఆ గదిలో ఒక్క కుండ కూడా లేదు. కావున నా జ్ఞానమును సద్బుద్ధితో నీవు విమర్శించు కొనవలయునే గాని, ఎంతమంది ఎన్నేళ్ళ నుండి చెప్పుచున్నారన్నది ప్రమాణముగా తీసుకొనరాదు. కావునే భగవద్గీతలో ‘విమృశ్యైతదశేషేణ’ అని, ‘నేను చెప్పిన దానిని బాగుగా విమర్శించుకొనుము’ అని కృష్ణుడు, అర్జునునికి చెప్పినాడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch