20 Feb 2025
[14-04-2004] నిజమైన భక్తుడు ఒక్క ఉన్మదావస్థలోనే భగవంతుని చేరగలడు. కృష్ణావతారములో రాధ ఒక్కతే ఆ ఉన్మదావస్థకు చేరుకున్నది. దశరథుని చూడండి – సత్యవాక్య పరిపాలనకే ప్రాధాన్యము ఇచ్చాడు. ఆయన రాముని భగవంతుడని విస్మరించాడు. కనుక భగవంతుని అందుకో లేకపోయాడు. కైకను చూడండి – రాముడు అప్పటికే తాను భగవంతుడనని వారందరికీ నిరూపించాడు. శివ ధనుర్భంగము చేసినపుడు రాముని భగవత్తత్త్వము తెలిసినది. పరశురాముని చేతనున్న నారాయణ ధనుస్సు స్వీకరించి దానిని భంగము చేసినపుడే రాముని అవతారతత్త్వము పరశురామునికి బోధపడి శరణాగతి చేసినాడు. అంత తెలిసీ రామునియందు ప్రీతిని కలిగిన కైక కూడ పుత్ర వాత్సల్యానికి బలైనది. అందువలన భగవంతుని చేరుకోలేకపోయినది. శ్రీమద్భాగవతములో గోపికలను చూడండి – స్వామిని చూడలేకుండా క్షణం కూడ ఉండలేమనుకున్నారు గదా. మరి వారు తమను వదలి ద్వారకలో నివసిస్తున్న కృష్ణుని వద్దకు ఎందుకు వెళ్ళలేదు. కనుక, దైవాన్ని చేరాలంటే సర్వబంధములు త్రోసిపుచ్చి ఒక్క భగవద్బంధమే మనకు మిగలాలి.
★ ★ ★ ★ ★