29 Nov 2024
[15-12-2005]
1) ఓం జగదీశ్వరాయ నమః, 2) ఓం కుటుంబేశ్వరాయ నమః, 3) ఓం దేహేశ్వరాయ నమః
4) ఓం ఆత్మేశ్వరాయ నమః, 5) ఓం సర్వేశ్వరాయ నమః
1. జగదీశ్వరాయ నమః – జగదీశ్వరుడు దత్తుడు
జీవుని చేతిలో ఏమీ లేదు. అంతా స్వామి చేతిలోనే యున్నది. భీష్మాదులును దుర్యోధనుని ఆదేశించగలిగారా? భీష్ముడు ధర్మరాజుకు తన మృత్యురహస్యమును చెప్పడము దుర్యోధనునికి ఇష్టం లేదు-ఆపగలిగాడా? కర్ణుడు అర్జునుని తప్ప మిగిలిన నలుగురిని చంపననటం దుర్యోధనునికి ఇష్టం లేదు. కాని ఆపగలిగాడా?
2. కుటుంబేశ్వరాయ నమః – కుటుంబేశ్వరుడు దత్తుడు
నీ కుటుంబంలోనివారు గూడ నీ అధీనంలో లేరు. నీ కుటుంబసభ్యులను నీవు రక్షించలేవు. పాండవులు బలవంతులైననూ వస్త్రాపహరణ సమయములో ద్రౌపదిని రక్షించగలిగారా? మార్కండేయుని తల్లిదండ్రులు అపమృత్యువు నుండి అతనిని కాపాడగలిగారా? నీ కుటుంబసభ్యులను కూడా కాపాడేవారు స్వామియే.
3. దేహేశ్వరాయ నమః – దేహేశ్వరుడు దత్తుడు
ఈ దేహము కూడా నీ అధీనంలో లేదు. శ్వాస నీ అధీనంలో ఉన్నదా? గుండె నీ అధీనంలో ఉందా?
4. ఆత్మేశ్వరాయ నమః – ఆత్మేశ్వరుడు దత్తుడు
ఆత్మ కూడా భగవంతుని చేతిలోనే ఉన్నది. కనుక నీ చేతిలో ఏమీ లేదు.
5. సర్వేశ్వరాయ నమః – సర్వేశ్వరుడు దత్తుడు
కనుక స్వామి సర్వేశ్వరుడు అని తెలుసుకొని ప్రతిరోజు ఈ భావనతో ఈ ఐదునామాలు జపించండి.
★ ★ ★ ★ ★