21 Feb 2025
[03-08-2000] భగవంతుడిని ఆవాహనము చేసి విసర్జించిన (ఉద్వాసన) చెప్పిన వాని ఇంటికి మరల ఎప్పుడు భగవంతుడు రాడు కావున వాడు ఆవాహనము చేయుట వ్యర్థము. అటులనే ఉద్వాసన చెప్పని వాని ఇంటి నుండి భగవంతుడు ఎప్పుడును పోడు కావున వాడును ఆవాహనము చేయు పని లేదు. యోగము ద్వారా నాస్తికునకు విశ్వాసము కలిగించి, జ్ఞానబోధ ద్వారా లక్ష్యము గురించి, లక్ష్యప్రాప్తికై ఉన్న మార్గము గురించి, లక్ష్యమును చేరు జీవుని స్వరూపమును గురించి (త్రిపుటి) చెప్పి వివరించు జ్ఞానమే యోగిరాజ–గురుస్వరూపము. ఇది మొదటి మెట్టు. జ్ఞానమును లోకములో కర్మతో ధర్మము ద్వారా ఆచరిస్తూ, లోకేశ్వరునకై తపించే కర్మయే తపస్సు. ఇది రెండవ మెట్టు. ఈ రెండు మెట్లు సాధకుని ప్రయత్నం చేత సాధ్యాలు. ఇక మూడవ మెట్టు భక్తి (భగవత్ర్పేమ). ఇది సాధకుని ప్రయత్న సాధ్యం కాదు. ఇది ఈశ్వరానుగ్రహ లభ్యము మాత్రమే.
★ ★ ★ ★ ★