home
Shri Datta Swami

 11 Dec 2024

 

శ్రీరామానుజాచార్యులవారు - విశిష్టాద్వైతసిద్ధాంతము

నేను విష్ణుదేవుడైన శ్రీరామానుజాచార్యుడను, జీవుని కన్నా చాలా ఎక్కువదియగు ఈ జగత్తు సత్యమేనని రామానుజ, మధ్వులు చెప్పిరి. అత్యల్పమైన ధర్మమును వేరు ధర్మముగా తీసుకొనవచ్చును, కాన అగ్ని కన్న భిన్నమైన ధర్మము కలదని రామానుజ, మధ్వులు స్థాపించిరి. ధర్మమనగా, ఆధారపడునది. అంతయును బ్రహ్మాధారమే కాన జగత్తును బ్రహ్మధర్మముగా తలచిరి. అత్యల్పమైన దాని యొక్క అస్తిత్త్వమును రామానుజ, మధ్వులు పట్టుకొనిరి. అత్యల్పమైననూ జగత్తు ఉన్నది. కానీ దానిలోని అత్యల్పమైన బ్రహ్మత్వమును లేనిదానిగా పరిగణించి బ్రహ్మ భిన్నమైన జగత్తు వున్నది అన్నారు రామానుజ, మధ్వులు. నిప్పురవ్వ అత్యల్పమైననూ ఉన్నది. నిప్పురవ్వలోని దాహకధర్మము అతి స్వల్పముగా ఉన్నది కాన, బూడిదకణముగా మహాగ్ని చుట్టూ ఉన్న బూడిద రాశి, మహాగ్ని యొక్క శరీరములోని ఒక అవయవము వంటి భాగము. ఇది విశిష్టాద్వైతము (qualified monism).

Swami

సాధన ఏమియు లేకుండగనే జీవుడు భగవంతుని శరీరావయవము అనుట విశిష్టాద్వైతము. జీవుడు బ్రహ్మముయొక్క  శరీరావయవము అని సాధన చేత తెలుసుకొనుట ఇక్కడి విశేషము. జగత్తులోని వస్తువులలో పాత్రౌచిత్యానుసారముగా (as suitabile to the role) స్వామి తన శక్తిని అభివ్యక్తము (express) చేయుటవలన, ఆ అభివ్యక్తశక్తిని (expressed power) అనుసరించి చూస్తే, అల్పశక్తియొక్క అభివ్యక్తి గల జీవుడు నా తనువు యొక్క అంగమే కాన జీవునితో దేవునికి విశిష్టాద్వైతము సత్యమే. బ్రహ్మమన్నచో తను స్వరూపముగా కనిపించు దత్త తనురూపమైన నరావతారమే. ఈ తనువు నశించదు. కాన బ్రహ్మము శరీరము నశించినా నశించుట లేదు. అయితే ఈ జగచ్ఛరీరము బ్రహ్మ తనువును విడువగా విలువ లేదు కావున అది విశిష్టాద్వైతము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch