home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

సాయి శిరమున - వస్త్రము నీవు


సాయి శిరమున - వస్త్రము నీవు |
సాయి పదముల - శునకమునేను || (పల్లవి)

దత్తదేవుని జ్ఞానము నీవు - దత్త చరణ ధూళిని నేను |
స్వామి కరమున కమలము నీవు - స్వామితన్Aనిన కుక్కను నేను ||

సాయి మౌళిని మకుటము నీవు - సాయి తిట్టిన మృగమును నేను |
కమలిని! సహ-స్రారము నీవు - శ్రీ చరణాబ్జ రజమును నేను ||

కాషాయరుచి పద్మము నీవు - పాపి కృష్ణ శ్వానము నేను |
నా సద్గురువు కమలము నీవు - నీకు జడతమ శిష్యుడ నేను ||

భక్తి సౌరభ నళినము నీవు - గోపీ పంక గంధుడనేను |
శాశ్వత మోక్ష కామివి నీవు - సంసారరస ముగ్ధుడనేను ||

బంధమోక్షమె నీకు లక్ష్యము - బంధనరసమె నాకు కామ్యము |
కాంతివి నీవు చీకటి నేను - నీవు వచ్చిన పారిపోదును ||

ఉషః కిరణము పద్మ వర్ణము - అంధకారము కృష్ణ వర్ణము |
సాయినాధా! చెప్పవయ్యా - కాలి కుక్కనె గురునిఁజేతువె ? ||

 
 whatsnewContactSearch