ఈదగలరా? దాటగలరా?
నన్నుపట్టిన మునిగి పోదురు (పల్లవి)
కుక్కతోక ఇది - గోదావరి అది | దొంగ గురువితడు - భవసాగరమది ||
గడ్డి పోచను - పడవ చేసిన | ఆదిలోనే మునక సత్యము ||
చిత్త నిగ్రహ - నిశ్చయమెచట? - చంచలుండగు - నేను ఎచ్చట?
యుగయుగంబుల తాపసులెచట? గోపికాకుల జారుడెచ్చట? ||
సర్వసంగ త్యాగులెచ్చట? - వెన్న ముద్దల చోరుడెచ్చట? |
ధర్మనిష్ఠా నియమమెచ్చట? - రాధికా ఘన మోహమెచ్చట? ||
ఉపనిషత్తుల - ఋషులు ఎచ్చట? - గీత పాడుచు కులుకులెచ్చట? |
పక్వలక్షణ - కాషాయమెట? - పీతాంభరపు తళుకులెచ్చట? ||
ప్రణవనాద ధ్యానమెచ్చట? - పిచ్చిపాటల వేణువెచ్చట? |
ఆదిదేవుని తాండవమెచట?- యువతులమధ్య నృత్యమెచ్చట? ||
ఆచరణైక వేదాంతమది - నమ్మువారిని ముంచుట ఇది |
యోగినాధుడు దత్తుడెచ్చట? - జారచోరుడు కృష్ణుడెచ్చట? ||