home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

మహిమఁ జూపిననే గతిలేదు


మహిమఁ జూపిననే గతిలేదు!
చిలక పలుకౌలకె గురువౌనా? (పల్లవి)

పండిత కులమున పుట్టితిని - శ్లోకములేవో వ్రాసితిని |
శుకమై మునులు రచించినవే - వేదాంతములను వాగితిని ||

బాలకృష్ణుడను సజ్జనుడే - మాయతెలియని భక్తుడిలన్ |
దత్తస్వామిగ పిలచె నను - సర్వత్ర దత్త దర్శనుడై ||

అదిగో పులియన ఇదిగో పులియని -పిచ్చి భక్తులిల నమ్ముదురెప్పుడు |
నను సేవించిరి నారాయణుడని - నరకులముననే అధముడ నిజమిది ||

ఏవో సిద్ధుల చూపితినందురు - నిజముగ నాకే తెలియవు చిత్రము! |
దత్తుడె వాటిని చూపియుండునని - భావించితి నే ననిశము మదిలో! ||

మహిమలఁ జూపిన మహనీయులనే - క్షుద్ర మాంత్రికులఁజేర్చెదరిలలో |
అష్టసిద్ధులను దైత్యులు చూపిరి - అవియే గుర్తులు కాకపోయెనిట ||

చిలుకను నేనిక ఎంత మాత్రుడను? - చెప్పిన వేమియు నాచరింపనిట |
భక్తుల సేవల పొందుట కొరకే - మాటల గారడి చేయుచునుంటిని ||

 
 whatsnewContactSearch