ఏదో ఒక సమయములోనను
దత్తుడు ఆవేశిస్తాడు (పల్లవి)
ఇంతమాత్రమున నేనతడా?- ఇత్తడి బంగారంబగునా ?
విద్యుత్తు ఉన్న సమయములో - తీగెయు విద్యున్మయమగును ||
విద్యుత్తుతీయ తీగెనిట - కాలతన్నుదురు ఓ కమలా!
ముద్దుగ కుక్కను ఎత్తుకొనన్ - వంకరతోకను జాడించును ||
వెంటనె క్రిందికి తోయునులే - కాలగట్టిగనె తన్నునులే|
అద్వైతంబది సాధకులన్ - పతితులఁజేయును జాగ్రత్త ! ||