సంన్యాసి దత్తుడు - సన్నాసి జీవుడు
సంన్యాసి వాడు - సన్నాసి నేను || (పల్లవి)
జీవుడు దేవుండగునా? దేవుడు జీవుండగునా? |
సన్యాసి సన్నాసి కాడు - సన్నాసి సంన్యాసి కాడు ||
అవతరించిన మాత్రమున - దేవుడు జీవుండగునా? |
ఆవేశించిన మాత్రమున - జీవుడు దేవుండగునా ? ||
చిలకపలుకుల పలికినంతనె - జీవుడు దేవుండగునా? |
మౌనముఁదాల్చిన మాత్రమున - దేవుడు జీవుండగునా? ||
సిద్ధులు చూపిన మాత్రమున - జీవుడు దేవుండగునా? |
సిద్ధులు చూపని మాత్రమున - దేవుడు జీవుండగునా? ||
అంతరాత్మ అనుభూతియె సాక్ష్యము - సత్య ప్రమాణము అంతర్వాణియె |
విష్ణుదత్తుడే మాటిమాటికిని - దత్తుని తెలియక తికమక పడెను ||
దత్త పరీక్షలు బహుకఠినంబులు - కత్తి అంచుపై నడకలు ధరలో |
వినవే కమలా! వినవే నళినీ! - దత్త మార్గమును విడిచి పెట్టుము ||