home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

ఎంత దయ ! ఎంత దయ ! ఓ సాయీ


ఎంత దయ ! ఎంత దయ ! ఓ సాయీ !
ఇంత దయ చూపితివె ! గోసాయీ ! (పల్లవి)

కాలికుక్కనే గురువుగఁ జేసి - వేద గీతలను చెప్పించితివి !
ఉచ్ఛిష్టముఁదిని బ్రతుకు జీవిని - నివేదనార్హుని చేసితివిచట ! ||

అంటగరానిది పిచ్చికుక్కయె - తలపై నుంచియు ఆడించితివి ! |
ఈ పిచ్చికుక్క కరచిన క్షణమె - బ్రహ్మఙ్ఞానము పిచ్చిపుట్టెనె? ||

కుక్క వచ్చునెడ శుద్ధి మంత్రములు ! కుక్కయె నాలుగు వేదములఁజెప్పె |
శీలుని గృహమున భోక్తగ వచ్చియు - నల్ల కుక్కనట వెంటఁదెచ్చితివి! ||

బ్రాహ్మణులందరు నిను వెలివేయగ - కృష్ణ శ్వానము వేదముఁబలికెను |
శ్వానము నేను కృష్ణుడు నేను - కృష్ణ శ్వానము నేనే దత్త ! ||

 
 whatsnewContactSearch