కమలములెన్నో ఉన్నవు (కానీ)
కృష్ణ భ్రమరము ఒక్కటె (పల్లవి)
అతి సుందరము అతి సున్నితము - అతి చంచలము యీ తుమ్మెద |
వేణు నాదము చేయు చుండును - భక్తి మధువుల గ్రోలు చుండును ||
వెంటబడినచో వెనుకకు తిరుగును - పొమ్మను వారల వెంటబడును |
ఒక్క పుష్పము చేరియుండదు - క్షణమున మారే చపల తత్త్వము |
అద్వితీయము తానొకటేయని - మిడిసి పాటునూ ఎగురు చుండును ||
వదనం కమలం - నయనం కమలం - పాణిః కమలం |
హృదయం కమలం - హస్తే కమలం - |
కమలాధిపతే రఖిలం కమలమ్ ||