కనవేల కనవేల కమలమ్మా!
గోపాలు గోలలు కోట్లమ్మా || (పల్లవి)
శీలరహితుడు ధర్మ బోధకుడు! -భోగ లోలుడు యోగ దర్శకుడు |
చేప్పేదొక్కటి చేసేదొక్కటి! - తలచేదొక్కటి టక్కరి దొంగ! ||
ఇంట అన్నము తినడోయమ్మా! - పరుల ఇళ్ళలో తింటాడమ్మా! |
స్వార్ధము వద్దని బోధిస్తాడు - స్వార్ధము కొరకే పరుల సేవలు! ||
దత్త వేదమను వేణువు నూదును - వచ్చిన వారల సేవలనందును ! |
దత్త గీతయను నెమలి పింఛము - ఆకర్షింపగ వలలో పడుదురు! ||
పిచ్చి భీష్ముడు పిచ్చి పార్ధుడు - పిచ్చి రాధయు వంచితులమ్మా! |
అన్నము పెట్టిన యశోదమాతనె - విడచివేసిన కఠిన కృతఘ్నుడు ! ||
తననే నమ్మిన గొల్లల వనితల - మానవహరుడగు పరమధూర్తుడు |
తస్మాజ్జాగ్రత తస్మాజ్జాగ్రత - దొంగ గురువుతో ప్రమాదమమ్మా ! ||