home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

ఏమి సేతురా జీవా ! నేనేమి సేతుర


ఏమి సేతురా  జీవా ! నేనేమి సేతుర?
ముక్తినొసగమని కాళ్ళపడేరు బంధము తెంచిన ఏడ్చేరు !    ||ఏమి||
మహిమల చూపిన గారడియందురు చూపకున్న నామాట వినరు.    ||ఏమి||
ఇహమూ కావలె మోక్షము కావలె భోగము కావలె యోగము కావలె    ||ఏమి||
మనిషిగ వచ్చిన పొమ్మంటారు సొమ్ములు పెట్టిన నవ్వెదరు !    ||ఏమి||

 
 whatsnewContactSearch