home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

ఉన్నాడయా దత్తుడున్నాడయా


ఉన్నాడయా దత్తుడున్నాడయా
అవతారముల నెత్తుచున్నాడయా
కన్నులకు కనిపించుచున్నాడయా
మనతోడ మట్లాడు చున్నాడయా (పల్లవి)

1.  వాణియు లక్ష్మియు గౌరియు అనఘయే | అనఘా పతిగ వెలుగుచున్నాడయా |
కీర్తించి సేవించి ధ్యానించు భార్యలను | వేరు పేరుల పిలుచుచున్నాడయా ||

2.  బాహ్య స్వరూపాన కనిపించుచున్నను | అంతః స్వరూపాన దాగేనయా |
అంతః స్వరూపంబు ప్రకటితము చేసిన | ఆనందమున నరులు రాలేరయా ||

3.  ఙ్ఞాన ప్రచారంబు సేయంగ స్వయముగ | దత్త గురుడే వచ్చుచున్నాడయా |
జీవ రూపాంతరుండు జీవ దేహములందు | వ్యాపించి ఆ రెండు తానేనయా ||

4.  మాయతో గట్టిగ కళ్ళ గంతలు గట్టి | మన మధ్యనే మసలుచున్నాడయా |
మాయ మాటలు జెప్పి భ్రాంతిని కలిగించి | మన తోడ మాట్లాడు చున్నాడయా |

5.  అనుమాన విశ్వాస డోలికల నెక్కించి | నిజ భక్తులను ఊపుచున్నాడయా |
అష్ట సిద్ధుల జూపి విశ్వాసమేర్పరిచి | ఙ్ఞాన బోధలు చేయుచున్నాడయా ||

 
 whatsnewContactSearch