దత్తులోరమండీ - భిక్షాదానము చేయండీ | (పల్లవి)
1. బాలునిలో వికలాంగునిలో - వృద్ధునిలో రోగగ్రస్తునిలో |
ఆవేశించి అడిగెదమండీ - మీ త్యాగ పరీక్షను చేస్తామండీ ||
2. సోమరి పోతులు కొందరు - మా పేరు చెప్పి అడిగెదరండీ |
వారికి భిక్షలు వద్దండీ - పని చేసే పధమును చూపండీ ||
3. ఙ్ఞాన విచక్షణతో - పాత్ర దానమును చేయండీ |
యోగ్యునకు ఇచ్చుట పుణ్యంబండీ - అయోగ్య దానము పాపంబండీ ||