home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

సత్యం ఙ్ఞాన మనంతం బ్రహ్మ


సత్యం ఙ్ఞాన మనంతం బ్రహ్మ (సాక్షాద్దత్తాత్రేయులము - గురువులదిద్దగ వచ్చితిమి) (పల్లవి)

1.  సత్యం ఙ్ఞాన మనంతం బ్రహ్మ - రసోవైస ఇతి శ్రుతి వాక్యాత్ |
ఙ్ఞానమె బ్రహ్మము ప్రేమయె బ్రహ్మము - అష్ట సిద్ధులివి మా సొమ్ములేను ||

2.  ఙ్ఞాన భాస్కరుడు దత్తాత్రేయుడు - తత్త్వాంబరమున గోచరించగా |
మాయగురువులిల అంధకారములు - పటాపంచలై పారిపోవగా ||

3.  క్షుద్ర మాంత్రికులు దానవాధములు - మొండి బిడ్డలిల మొండి తపస్సుల |
తండ్రి సొమ్ములను పొంది ధరించిన - ఙ్ఞాన ప్రేమల పొందగ సాధ్యమె ||

4.  సొమ్ముల చూపిన బ్రహ్మమగుదురె - ఙ్ఞాన ప్రేమలు మా స్వరూపములిల |
స్వరూపము చేత గుర్తించు రాణి - రాజును కిరీటము చేత కాదుగ ||

5.  ఇంద్ర పదవిలో నహుషుడు నిలచిన - వానిని శచి పతిగా నొప్పుకొనెనె |
పద్మ నాళమున దాగిన ఇంద్రుని - స్వరూపము చేత గుర్తించె సతియు ||

6.  స్వార్ధముల దీర్చు సిద్ధులఁ జూపియు - జీవులనాకర్షించిన మాత్రము |
సొమ్ముల కోసమె వేశ్యలు వత్తురు - భగవద్గుణాభిమానము నటనయె ||

7.  సత్య భక్తుడిల సీతమ్మ బోలి - సొమ్ములు లేకున్నను పతిరూపమె |
హృదయాకర్షణమై వని కేగెను - ఙ్ఞాన ప్రేమలె బ్రహ్మ రూపమగు ||

8.  స్వార్ధముఁదీర్చెడి సిద్ధుల జూపిన - వచ్చెడి భక్తులు నాకేల కోట్లు? |
స్వార్ధరహితుడై నా కొరకె వచ్చు - ఒక్క భక్తుడిల దొరికిన చాలును ||

9.  లారీలు ఏల? గులకరాళ్ళు ఇవి - కోహినూరు వజ్రమొక్కటి చాలును |
ఎండమావులీ భక్తుల ప్రేమలు - గంగా జల కణమే సద్భక్తుడు ||

 
 whatsnewContactSearch