దత్తస్వామిని నేనేరా - నాకే దాసోஉహమ్మనరా || (పల్లవి)
1. ఉద్ధరించెదను నిన్నుపుడే - కండ్ల గంతలను విప్పెదను |
ఙ్ఞాన యోగమను దీపముతో - భక్తి మార్గమున కదులుమురా ||
2. ఏ జీవునికై మురిసితివో - వర్జించి నాడు నిను వాడు |
గుడ్డి మోహమును వదులుమురా - ఇప్పటి కైనా తెలుయుమురా ||
3. నిత్యము నిను కని పెట్టెదను - నీ శ్రేయస్సునె కోరెదను |
జన్మ జన్మలను తోడగుచున్ - నీ వెంట నుంటి నీడవలెన్ ||
4. చేతి నూపి నైవేద్యములన్ - నా కర్పింతువు మాయావీ |
నా నుండి వరము కోరెదవు - సత్యమైన సిరి సంపదలన్ ||
5. దొంగాటలాడ మనసాయె - నర రూపములో దాగితిని |
గుర్తించినారు, నిమిషములో - అరటి తొక్కపై కాలిడిరి ||