దత్తాత్రేయ మునీంద్రులము - అనసూయాత్రి సుపుత్రులము (పల్లవి)
1. నిర్వికారులము! నిత్యులము - నిరంజనులమై నిలచితిమి |
మానావమానములు రెండు - సంతోషదములె మాకెపుడు |
భక్త రక్షణమె మా వ్రతము ||
2. నిరంతరము సంచారులము - ఙ్ఞాన భిక్షలను పంచెదము |
యోగులము మరియు భోగులము - భక్త కర్మ ఫల రోగులము |
అపార దయా సాగరులము ||
3. విశ్వ కర్తలు, భర్తలును - విశ్వ హర్తలు త్రిమూర్తులము |
అద్వితీయ - అవధూతలము - ఆద్యంత మధ్య రహితులము |
ఆనందార్ణవ రూపులము ||
4. గుర్తించలేరు మమ్మెవరు - మాయలె చేష్టలు వేషములన్ |
మా దయ గలిగిన చిక్కుదుము - భక్తి సన్నగిల జారుదుము |
జారిన చిక్కము ఎన్నటికిన్ ||