మూడు తలలోణ్ణిరా నేను - మూడు లోకాల ఏలికనురా
చూచి చూడలేని జనులారా - చూచి పోదామని వచ్చానురా ||(పల్లవి)
1. మీ బుద్ధులన్నిటిని చూశానురా - ఆనందమానందమాయెనురా |
ఒకరి నొకరు దోచుకుంటూనే - ఎంత ముచ్చటగ ఉన్నారురా ||
2. కాల కర్మలను చక్రముల - క్రిందపడి నలిగేటి చీమలారా ! |
దేవుడెచ్చటయనుచు అడిగేరు - మాతెలివి చూడమని మురిసేరు ||
3. మా ప్రతిభ చూడమని పలికేరు - యంత్రముల కనిపెట్టినారు |
అవి జీవ నాశమై నిలువ - నా సృష్టియే మంచిదనిరి ! ||