home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ దత్తోஉహం గురుదత్తోஉహమ్



(Sung by Smt. Devi)

శ్రీ దత్తోஉహం గురుదత్తోஉహమ్
ప్రభు దత్తోஉహం శృణురే జీవ! (పల్లవి)

ఓ జీవుడా, నేనే త్రిమూర్తి స్వరూపుడను, తెలుసుకో! (శ్రీదత్తుడు విష్ణువు, గురు దత్తుడు బ్రహ్మ, ప్రభుదత్తుడు శివుడు)

నానా మార్గా న్గురూన్విలోక్య  భ్రమవికటధియ శ్శిష్య భ్రమరాన్ |
అవతీర్ణోஉహం వేణోర్గానం - శ్రుతి సిద్ధాంతం రచయామీహ ||

పెక్కురు ప్రబోధకుల వివిధ ప్రబోధ మార్గాలను చూసి వారిని తేనెటీగలవలె సంభ్రమంతో అనుసరించు శిష్యులను కూడ చూసి నేనే వేదధర్మమును ప్రబోధించుటకు, స్వయంగా కృష్ణుని వేణువు యొక్క గానమై అవతారంగా దిగి వచ్చాను

గోపరిపాలో గోపాలోஉహం - ధర్మో గౌరియ మునుసరతీహ |
సర్వే గురువో ప్యాకృష్టాస్స్యు - రితి కృష్ణోஉహం మూర్తిర్దత్తః ||

నేను గో రక్షకుడైన గోపాలకుడను (కృష్ణుడను). కావున, ధర్మదేవత శ్రేష్ఠమైన గోరూపం ధరించి ఎల్లపుడు నన్నుఅనుసరించును. ఆది రూపంలో దత్తుడనూ, కృష్ణునిగా పిలవబడే దత్తుడనూ నేనే. నా వేణువుపై మధురగానంతో అట్టి ప్రబోధకులనందరినీ ఆకర్షిస్తాను కావున నన్ను కృష్ణుడు (ఆకర్షించువాడు) అని పిలుస్తారు.

చత్వారోమే వేదాశ్శిష్యాః - సామవేద ఇహ పద్మాఖ్యాతా |
ఋగ్వేదోஉయం బాలఃకృష్ణో - యజురజయోஉయం భీమస్తుర్యః ||

నేను సృష్టించిన నాలుగు వేదాలు శునకరూపం ధరించి నాలుగు కుక్కలై నాతో ఎల్లపుడు కనిపిస్తాయి. సామవేదము గాయని పద్మారామ్. ఋగ్వేదము బాలకృష్ణ (సి.బి.కె.మూర్తి). యజుర్వేదము అజయ్. నాలుగవదైన అథర్వవేదము సంవాదము చేసే ఫణి (భీమశంకరం గారి పుత్రుడు).

మొదటి, మరియు అతి ప్రాచీనమైన ఋగ్వేదానికి బాలకృష్ణమూర్తి ప్రతీక. యజుర్వేదము కర్మ, త్యాగమనబడే యజ్ఞమునకు ప్రతీక. దీనికి ఎల్లపుడు తీవ్ర పరిశ్రమ చేస్తూ, త్యాగరూపమైనటువంటి అజయ్ ప్రతీక. సామవేదము గానరూపంలో ఉంటుంది, ఆ గానానికి పద్మారామ్ ప్రతీక. యుద్ధంలో వాడే దివ్యాస్త్రాలు ధనుర్వేదంలో భాగమైతే, ఆ ధనుర్వేదం అథర్వవేదంలో భాగం. స్వామిని నిష్కారణంగా విమర్శించే వారితో తీవ్ర వాదం చేసే శ్రీ భీమశంకరం పుత్రుడైన ఫణి ఈ వేదమునకు ప్రతీక. ఈ విధంగా తన ప్రాథమికమైన నలుగురు భక్తులగురించి స్వామి వివరిస్తారు.

శఙ్కరోஉహమపి రామానుజ ఇతి - మధ్వాచార్య స్త్రిగురుః పూర్వమ్ |
శఙ్కర విష్ణు బ్రహ్మత్రిమూర్తి - రవతీర్ణోஉహం మూఢః కలహః ||

నేనే శంకర, రామానుజ, మధ్వావతారములు ధరించినవాడను. ఈ ముగ్గురు నా దివ్యమైన నరావతారములే కాక, నా తేజోవతారములైన శివ, బ్రహ్మ, విష్ణు స్వరూపంగా ఉద్భవించినారు. నిజానికి ఈ ముగ్గురు ఒకే తత్త్వాన్ని బోధించారు. కేవలం మూర్ఖులు మాత్రమే వీరి వ్యాఖ్యానాలలో భేదాలున్నవని వాదిస్తారు.

 
 whatsnewContactSearch