home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

వందేஉతి రమ్యం | విశ్వైకగమ్యం


।।వందే ఽతి రమ్యమ్।।

 

వందేఽతి రమ్యం । విశ్వైక గమ్యమ్ ।
ఉన్మత్త దత్తం । గురుదేవమ్ ।।పల్లవి।।

సమస్త సృష్టిలో తన బాహ్య, ఆంతరిక సౌందర్యముతో ప్రకాశించేటటువంటి, జీవులకు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించేటటువంటి, ఉన్మత్త దత్తునిగా పిలువబడేటటువంటి, సమస్త ప్రపంచమునకు సద్గురువైనటువంటి గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

 

వేదాంత సారం । నానావతారం । - భక్తోపకారం భజ దత్తమ్ ।।1।।

వేదాంత జ్ఞానమైన ఉపనిషత్తుల సారమైనటువంటి, అనేకములైన దివ్య రూపములలో అవతరించేటటువంటి, సద్భక్తులకు వారి వారి ఆధ్యాత్మిక మార్గ పురోగతికోసరం పరమ కరుణతో సహాయం చేసేటటువంటి గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

 

సంసార పారం । రుద్రాక్షహారం । - నీహార గౌరం । భజ దత్తమ్ ।।2।।

ఈ సమస్త సంసారమునకు ఆవలివైపున్నటువంటి, కంఠమందు రుద్రాక్షమాలను ధరించినటువంటి, తెల్లని మంచు బిందువుల వంటి శరీర ధావళ్యము కలిగినటువంటి, గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

 

కాషాయ చేలం । పాత్రాక్షమాలం । - ఆమ్నాయ మూలం । భజ దత్తమ్ ।।3।।

కాషాయ వస్త్రమును ధరించినటువంటి, రెండు చేతులలో కమండలము-అక్షమాల (జపమాల)లలను ధరించినటువంటి, నాలుగు వేదములకు మూలమైనటువంటి గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

జ్వాలాక్షి ఫాలం । ఢక్కా త్రిశూలం । - కంఠాహి నీలం । భజ దత్తమ్ ।।4।।

నుదుటిపై మూడవదైన అగ్ని నేత్రమును కలిగినటువంటి, రెండు చేతులలో ఢమరుకము, త్రిశూలములను ధరించినటువంటి, కంఠమందు హాలాహలమును సేవించగా కలిగిన నీల వర్ణపు మచ్చను మరియు సర్పమును కలిగినటువంటి గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

 

పాదాంత శక్రం । విచ్ఛిన్న నక్రం । - శ్రీ శంఖ చక్రం । భజ దత్తమ్ ।।5।।

దేవతలకే రాజైన ఇంద్రుడు తన పాదములను ఆశ్రయించినటువంటి, గజరాజు యొక్క పాదమును పట్టుకొన్న మొసలిని తన సుదర్శన చక్రముతో ఖండించినటువంటి గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

 

కందర్ప రూపం । సౌందర్య దీపం । - యోగీంద్ర భూపం । భజ దత్తమ్ ।।6।।

కోట్లమంది మన్మథుల అందాన్ని తలదన్నేటటువంటి, సౌందర్యమే దీపమై ప్రకాశిస్తున్నదా అనిపించేటటువంటి, మహా మహా యోగీంద్రులకే యోగిరాజైనటువంటి గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

 

మంత్రాత్మ బీజం । తంత్రార్థ భాజం । – శ్రీ యంత్రరాజం । భజ దత్తమ్ ।।7।।

సమస్త మంత్రములకు బీజరూపమైనటువంటి, సమస్త తంత్రముల ఫలమును పొందేటటువంటి, యంత్రరాజమైన శ్రీచక్రమునకు రాజైనటువంటి గురుదత్తునికి శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.

 
 whatsnewContactSearch