దత్తాత్రేయా ! దత్తాత్రేయా !
దత్తాత్రేయా ! త్రిమూర్తి రూపా || (పల్లవి)
1. నీవే బ్రహ్మవు - నీవే విష్ణువు - నీవే శివుడవు - దత్తాత్రేయా ||
వాణీ లక్ష్మీ గౌరీ నాధా ! దత్తాత్రేయా త్రిలోక పూజ్యా !
శంఖీ చక్రీ ఢక్కా శూలీ ! కుండీ మాలీ దత్తాత్రేయా !
కాశీ స్నానము - మాహురి భిక్షయు - సహ్యము శయ్యా - దత్తాత్రేయా !
2. ఒకచో యోగిగ - ఒకచో భోగిగ | దర్శనమిచ్చే దత్తాత్రేయా !
ధర్మమె ధేనువు - శ్రుతులే కుక్కలు | వెంటబడిన ఓ దత్తాత్రేయా !
దేవదేవతలు - ఋషులును సిద్ధులు | గ్రహములు నీవే దత్తాత్రేయా !
యోగ భ్రష్టుని - నను కాపాడుము | దయతో దేవా | దత్తాత్రేయా !