home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

అంతా దత్త మయం


అంతా దత్త మయం - ఈ జగమంతా దత్త మయం
దత్త మయం - శ్రీ దత్త మయం
గురు దత్త మయం - ప్రభు దత్త మయం (పల్లవి)

1. పంచభూతము లంతటనుండు - బ్రహ్మమంతట దత్తుడె కలడు |
నేను లేనిది నేను కానిది - ఏమున్నదిచట ఎచ్చటనైన |
విశ్వ కర్తను విశ్వ భర్తను - విశ్వ హర్తను దత్తుడు నేను |
సృష్టి నాటక సూత్రధారిని - పాత్ర ధారిగా అవతరించును ||

2. నీకై నీవుగ నను గుర్తించవు - నేను తలచిననె నను గుర్తింతువు |
నా క్రీడ ఇదె నవరస భరితము - నను సేవించుము నా దాసుడవై |
ప్రతిఫలమేమియు కోరక నన్నే - ప్రేమించుమిదే ముక్తికి మార్గము |
నా సద్గుణముల నభిమానించుము - కారణమిదియే కావలె పూజకు ||

3. అష్ట సిద్ధుల అవసరమేల - సుందరాకృతికి సొమ్ములు ఏల |
ఙ్ఞాన యోగమే నా సౌందర్యము - ఙ్ఞానులు వ్యక్తిని గుర్తించెదరు |
ఎన్నో పాత్రల ఏక కాలమున - అభినయింతునీ చలనచిత్రమున |
ఏ వేషమైన పతిని పతివ్రత - దత్తుని భక్తులు తెలుసుకొందురు ||

దత్తుడు నేనే - భక్తుడు నేనే - ఒక్కడే మీమీ భావ సిద్ధుడు |
సత్యం నేనే - సర్వం నేనే - నిత్యం నేనే - నీవూ నేనే ||

 
 whatsnewContactSearch