కొండల రాజా! ఈ బండ మనసుల
భక్తి ఝరులిక పుట్టవు పుట్టవు
కుందేటి తలపై కొమ్ము పుట్టినను
ఎండ మావుల నీరు చిక్కినను || (పల్లవి)
1. రాధ ఎచ్చట ! మీర ఎచ్చట ! - గోదా ఎచ్చట ! నాంచారి ఎట ! |
శంకరుడెచట ! రామానుజుడెట ! - రామకృష్ణ పరమహంస ఎచ్చట ! ||
2. పతులను సతులను ధనముల గృహముల - కాలదన్నిరే నీ కొరకై |
ఒక్క గంటయును నీ ముచ్చటలో - స్థిరముగ నుండరు చంచల చిత్తులు ||
3. చలన చిత్రముల వ్యర్ధ భాషణముల - గంటలు గంటలు ఆసీనులగుచు |
పిడుగులు బడ్డను విన ప డవవియె - బురద గుంటయే వీరికి బ్రహ్మము ||