home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

బ్రహ్మన్న నేనె, వెంకన్న నేనె


బ్రహ్మన్న నేనె, వెంకన్న నేనె, రుద్రన్న నేనె ఓరన్నా (పల్లవి)


హనుమన్న నేనె గరుడన్న నేనె - శేషన్న నేనె ఓరన్నా |
రామన్న నేనె కృష్ణన్న నేనె - రంగన్న నేనె  ఓరన్నా|
గణపన్న నేనె లలితమ్మ నేనె - నావేషములివి ఓరన్నా |
సర్వ వేషముల దత్తుడొకడె - పరబ్రహ్మమన ఓరన్నా |
మత కలహమేల? వేషధారియగు - దత్తన్న ఒకడె ఓరన్నా |

భిన్న మార్గములు భిన్న దేవతలు - భిన్న జీవులకు ఓరన్నా |
నానానదులును నానా పధముల - నాలుగు జలధుల పడునన్నా |
నాలుగు జలధులు పేరుకు వేరగు - జలధి ఒక్కటే ఓరన్నా |
సర్వమతస్ధులు విశ్వజీవులిల - నన్నె చేరుదురు ఓరన్నా |
సర్వ శక్తులును కలవాడనుచు - సర్వ సమ్మతము ఓరన్నా |

నిరాకారముగ సాకారముగను - ఉండగలడతడు ఓరన్నా |
నిరాకారమును ధ్యానించ కష్ట - మాకారమె సులభంబన్నా |
ఆకారములందున పూర్ణంబగు - నరాకారమె ఓరన్నా |
దర్శన స్పర్శ సంభాషణ - సహవాస లాభమది ఓరన్నా |
నరగుణములుండు బాహ్యరూపమున - లోపల తత్త్వము వేరన్నా |
విద్యుత్తీగెనుచూడగ బయటకు - మామూలుతీగెయేనన్నా |
మనుష్యతనువున పరమాత్మ వచ్చు - గుర్తించలేరు ఓరన్నా |
శరీరగుణముల నాలోకించుచు - నరుడని భ్రమింతురోరన్నా ||

 
 whatsnewContactSearch