home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

దత్తులోరమండీ - మేమే దిగి వచ్చితి మండీ


దత్తులోరమండీ - మేమే దిగి వచ్చితి మండీ ||  (పల్లవి)


సాధన పూర్తిగ చేయకయే! కొన్ని సిద్ధులను పొందగనే |
అవతారములుగ గురువులుగా! బ్రహ్మాஉహమని కొందరిలన్ |
అష్ట సిద్ధులకు అధిపతియౌ ! సృష్టి స్ధితి లయకరుడతడె |
ఆంజనేయుడే వినయముతో ! దాసోஉహమ్మను మాకుగదా ||

సృష్టి స్ధితి లయ కర పదమే ! - మా కిరీటమిది ఇచ్చితిమి |
అతడికె బాధ్యత లేదు యికన్! అవతారముల రమించెదము |
మా సొమ్ములేను సిద్ధులిలన్ ! బహుమానముగా ఇచ్చెదము |
ఙ్ఞానమె ప్రేమయే మా గుర్తు! అవె మా రూపము, మా కళయౌ ||

మా ఊహలేను జగమంతా! అష్ట సిద్ధులను ఊహలుగా |
ఊహలె  జీవులు వినోదమే!ఊహించు వ్యక్తి  మేమేగా |
సృష్టి, స్ధితి లయ కారణమౌ! ఒక్క బ్రహ్మమే చిద్ఘనమై |
దత్త కృతిగా వెలిగెదము! బ్రహ్మ విష్ణు శివ వేషములన్ ||

 
 whatsnewContactSearch