సాగర లంఘన సంకుల వానర కులమవ లోక్య నిజస్తుతి లోలం |
జలధర చుంబి మహా కృతి రేక పద క్రమలంఘిత జల నిధి రేవమ్ |
రఘుపతి మానందయసిచ సీతా కుశల నివేదన హృతఘన శోకం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(సముద్రమును దాటు విషయములో వ్యాకులమై తనను స్తుతించుటలో మునిగి యున్న వానర కులమును చూచి జలధరములను చుంబించు మహాకారముతో కేవలము ఒకఅడుగుతో జలధిని లంఘించి, సీత క్షేమముగా ఉన్నదను వార్తను నివేదించి ఘనమైన శోకమును పోగొట్టి రఘుపతిని ఆనందింపచేయుచున్నవు ఓ కపీశ్వరా! మహాసంకట మోచనుడవను పేరు నీకున్నదని ఈ జగత్తులో ఎవరికి తెలియదు).
అహికుల బంధన మోహిత దాశరధీ ద్వయ మాలోక్య మనో వికలం |
ఖగపతి మానయసిస్మ వికుంఠా పురగతమస్త్ర విమోచనదక్షమ్ |
పునరాయోధన బలినం వహసిచ భుజయుగరూఢం సోదరయుగ్మం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(నాగముల పాశముతో మూర్ఛిల్లి నిశ్చేష్టులైన రామలక్ష్మణులను చూచి ఆ నాగాస్త్రమునుండి మోచనము కలిగించుటలో సమర్ధుడైన గరుత్మంతుని వైకుంఠమునుండి తీసుకువచ్చి నాగపాశ విమోచనము గావించి మరల యుద్ధమునకు సన్నద్ధులైన రామలక్ష్మణుల సోదరుల జంటను, నీ భుజస్కందములపైమోయుచున్నావు ఓ కపీశ్వరా!...)
మూర్ఛిత లక్ష్మణ భోధసమర్ధ మహౌషధిసంజివిలతాం నేతుం |
ఉత్పతసి క్షణ మద్రిముపానయసిస్మ కరేణ తమివ సుమగుచ్ఛమ్ |
ఉత్థిత లక్ష్మణ కరయుగ వందన మాలింగసి విహసంశ్చ సరాగం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(యుద్ధములో మూర్ఛిల్లిన లక్ష్మణుని మూర్ఛను పోగొట్టుటకు సమర్ధమైన మహౌషధి యగు సంజీవి లతను తీసుకొని వచ్చుటకు ఒక్క క్షణకాలములో ఎగిరి ఆ సంజీవి పర్వతమునే పూలగుత్తివలె చేతిలో ధరించి తీసుకొని వచ్చినావు. సంజీవి లతతో మూర్ఛ నుండి లేచిన లక్ష్మణుడు రెండు చేతులెత్తి చేసిన నమస్కారమును పెద్దగా నవ్వుచూ ప్రేమతో గ్రహించినావు ఓ కపీశ్వరా!...)
శతముఖ రావణ హృత రఘునాయక మంబా బలిపశుముపగత మోహం |
పునరానయసిచ తమసురముపగత జీవం విధాయపాతళేశమ్ |
రాఘవశరమూర్ధ్వముఖంకృత్వా నమ్రం హరసిచ యుధి దశకంఠం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(కాళికాదేవికి బలినిచ్చుటకై శతముఖ రావణుడు మాయచే మోహింపచేసి రఘునాయకుని పాతాళమునకు తీసుకొనిపోగా, ఆ పాతాళ రాజగు శతముఖ రావణుడగు రాక్షసుని విగతజీవుని చేసి శ్రీరాముని మరల కొనితెచ్చినావు. రావణునితో రాముడు యుద్ధము చేయునప్పుడు యుద్ధనీతి ననుసరించి ఊర్ధ్వముఖముగా బాణమును వేయగా నీతండ్రియగు వాయుదేవుని అర్ధించి ఆ బాణము అధోముఖముగా చేసి రావణుని నాభిలోయున్న అమృత కలశమును ఛేదించి సంహరించినావు ఓ కపీశ్వరా! ...)
శృంఖలయా నియత శనైశ్చరమపి మోచయసిస్మ శుచ స్సహసాతం |
కోమే సంకట ఇహ హనుమన్గురు సోదర మామవ దయయా దీనమ్ |
కధమపి యోగ్యో నాహమకారణ కరుణైవ తవహి కారణమేకం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(సర్వసంకట కారకుడగు శనైశ్చరుడే లంకానగరమున ఇనుప సంకెళ్ళతో బంధించబడి దుఃఖసంకటములో పడగా వెంటనే ఆ శనైశ్చరుని బంధవిముక్తిని గావించితివి. అట్టి నీకు ఇచ్చట నా సంకటమొక లెక్కయా? ఓ హనుమంతా! అన్నా! గురుదేవా! దయతో దీనుడైన నన్ను రక్షించుము. ఏ విధముగా చూచినను నాకు యోగ్యత లేదు. కాని అకారణమైన నీకు గల కరుణయే ఒకే ఒక కారణముగా నన్ను రక్షించుము ఓ కపీశ్వరా!...)
వానరసింహ ఖగేశ వరాహ హయానన పంచానన శివరూపం |
వైష్ణవ తిలకం భవిష్య జగతాం ధాతారంత్వాం నమామిదేవమ్ |
త్రిమూర్తి తత్వం సాక్షాద్దత్తం పరమబ్రహ్మహి లీలాదాసం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(వానర - సింహ - గరుడ - వరాహ -హయ - ముఖములతో పంచానన శివ రూపుడును విష్ణు తిలకము గలవాడును ఈ జగత్తుకు భవిష్యద్బ్రహ్మయు త్రిమూర్తి తత్త్వముతో సాక్షాద్దత్తుడవయ్యును లీలా వినోదముకు దాసుడుగా గోచరించు ఓ హనుమద్దేవా! నిన్ను నమస్కరించుచున్నాను ఓ కపీశ్వరా!...)
హే కనకాంశుక ! కాంచన కుండల వందేత్వాం హనుమంతమనంతం |
హేపింగళాక్ష ! సద్గుణ సాగర ! మామవ సతతం మాయామూఢమ్ |
హే మేరుగిరి సముజ్వల విగ్రహ ! పాలయమాం తవ పదయుగలోలం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(బంగారు వస్త్రములు ధరించినవాడా! బంగారు కుండలములు కలవాడా! అనంతా! హనుమంతా! నీకు వందనములు. ఓ పింగళాక్షా! ఓ సద్గుణ సాగరా! మాయచేమూఢుడైన నన్ను సదా రక్షించుము. మేరు పర్వతమువలె ప్రకాశించు శరీరము కలవాడా! నీ చరణ ద్వయమునందు ఆసక్తుడైన నన్ను పాలించుము ఓ కపీశ్వరా!...)
సంకటమోచన హనుమద్దేవ మహాస్తుతి మేతాం గాయతి నిత్యం |
యోమనుజస్స సమేతి శతాయు ర్బల మారోగ్యం తేజోధైర్యమ్ |
శతశత సంకట జాల మపిక్షణ మేవ వినశ్యతి యాతి సతోషం |
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్ ||
(ఈ సంకటమోచన హనుమద్దేవతా మహాస్తోత్రమును ఏ మానవులు నిత్యము పాడుదురో వారికి శతాయుర్దాయము, బలము, ఆరోగ్యము, తేజస్సు, ధైర్యము లభించును. వందల కొలది సంకటములు వలగా చుట్టినను ఒక్క క్షణ కాలములో నశించి ఆ మానవులు ఆనందమును పొందుదురు ఓ కపీశ్వరా!...)