home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

రమించు వాడెవరురా ! నిను వినా ! గురువరా


రమించు వాడెవరురా ! నిను వినా ! గురువరా ! దత్తా !  (పల్లవి)

1. అనేక వేషములలో - నరావతారములలో |
రమింపఁ జేసి పరులన్ - రమించు చుందువెపుడున్ |
సహస్ర శీర్ష పురుషా - సహస్ర నేత్ర చరణా |
విభిన్న పాత్ర రమణా - వినోద మోద రసికా ||

2. ఒకండవై రమణమున్ - వరించి చేసి జగమున్ |
రమించి సాక్షి వగుచున్ - నటింప కోర్కె కలుగన్ |
జగత్తు దూరితివిగా - రమించుచు న్నటుడవై |
రమించు రాముడనగా - వినోదమే జగములే ||

3. స్వభక్త కర్షకుడవై - రమింప చేసి పరులన్ |
జగాన కృష్ణుడనగా - ప్రసిద్ధి చెందితివిగా |
నిరంతరంబు జగమున్ - చరించు చుండునిటులన్ |
వినోదమాగదుగదా - రహస్య సత్య మిదియే ||

 
 whatsnewContactSearch