శ్రీ కృష్ణ దత్త్తయ్య ఎక్కడుంటివో
నీ భక్త హృదయాల నిలచి యుంటివో (పల్లవి)
1. కృష్ణ పెదవులందు ప్రేమ నవ్వులే |
ఆ నవ్వుకు శరణు కృష్ణయ్యా శరణు శరణు |
దత్తయ్య కనులందు యోగ జ్యోతులే |
ఆ జ్యోతికి శరణు దత్తయ్యా శరణు శరణు ||
2. కృష్ణయ్య గానమందు కోటి వీణలే |
ఆ గానానికి శరణు కృష్ణయ్యా శరణు శరణు |
దత్తయ్య ఙ్ఞానమందు కోటి సూర్యులే |
ఆ ఙ్ఞానానికి శరణు దత్తయ్యా శరణు శరణు
3. కృష్ణయ్య తలమీద పింఛమున్నదే |
ఆ పింఛానికి శరణు కృష్ణయ్యా శరణు శరణు
దత్తయ్య తలమీద జడలున్నవే |
ఆ జడలకు శరణు దత్తయ్యా శరణు శరణు ||
4. కృష్ణయ్య చేతిలోన మురళి ఉన్నదే |
ఆ మురళికి శరణు కృష్ణయ్యా శరణు శరణు |
దత్తయ్య చేతిలోన వేదమున్నదే |
ఆ వేదానికి శరణు దత్తయ్యా శరణు శరణు ||