home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

గొల్లభామా ! గొల్లభామా


గొల్లభామా ! గొల్లభామా ! - ఏమి యిచ్చి ఋణముఁ దీర్తు (పల్లవి)


1. పతిని సుతుల కాలఁదన్ని - పరుగు తోడ దూకినావె |
అత్త మామలెదురు నిలువ -త్రోసిపుచ్చి వచ్చినావె |
సత్యలోక మిత్తునన్న - కాలిగోటి సాటిరాదు |
నీదుపాద పద్మయుగము - హృదయమందు నుంచుకొందు ||

2. యమున వద్ద వలువలన్ని - దొంగిలిచ చేతులెత్తి |
అణువు అణువు నేవె అనుచు - మ్రొక్కినట్టి ముద్దులాడి |
మనముఁ గొట్టు మన్మధుండు - బ్రతుకఁ జాల ధరణి నింక |
కాలిఁ గొట్టు బోయవాడు - వాలిసుతుడు రాడదేల ||

3. రుక్మిణమ్మ వట్టి బొమ్మ - చుప్పనాతి సత్యభామ |
రాధ ఎపుడు ఏడ్చు గంగ - వలపు నీదె గొల్లభామ |
రాకు రాకు గొల్లభామ ! - వత్తువేని పోకు పోకు |
రాని యెడల విరహ బాధ - వచ్చిపోవ ప్రాణమెగురు ||

4. గొల్లభామ గొల్లభామ - నామ జపమె ధ్యానమయ్యె |
కనుల నీరు జలధులయ్యె - విషము నైన నిచ్చి పొమ్ము |
ద్వారనగర జలధి చేరు - బృంద యమున గిరుల దాటి |
అటుల నీవు అడ్డులన్ని - దూకిరమ్ము నన్ను చేర ||

 
 whatsnewContactSearch