home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రావణాభ్ర మేఘమాల !

(బృందలో నున్న గోపి, ద్వారకలో నున్న స్వామికి పంపిన సందేశము)

శ్రావణాభ్ర మేఘమాల ! చెప్పిరావె నీవయినా  (పల్లవి)

1. మదిని కొల్ల గొట్టి పోయె - మనోహరుడు ఏడివాడు ? |
కానరాక మురళినూది - పులబాణ మేయువాడు |
ఏల ఉండు నమ్మరేడు? - మత్తులోన ముంచినాడు |
ప్రాణములివె పోవుచుండె - దోచుకొనెనె దొంగవాడు ||

2. మాయతోడ మాయగెలుపు - మంటు మాయ చేసినాడు |
మనసుదోచు కొనుట తెలుసు - మనసు తెలుసు కొనగలేడు |
విశ్వమంత నిండియున్న - విష్ణుదత్త కృష్ణుడతడు |
నిలువనీడు నీలమేఘ - శ్యాముడైన కొంటెవాడు ||

 
 whatsnewContactSearch