(Sung by Smt. Devi)
శ్రీ బ్రహ్మదత్తులు
శ్లో|| శివశ్రీశయోరాన నాభ్యాం షడంసం చతుర్వేద మూలం జగత్సృష్టిలోలమ్
సరస్వత్యుపేతం సరోజాత వర్ణం పరబ్రహ్మ మధ్యం భజే దత్తదేవమ్ ||
శ్రీ విష్ణుదత్తులు
శ్లో|| విధీశానయోరాన నాభ్యాం షడంసం ఘనశ్యామ గాత్రం ప్రఫుల్లాబ్జనేత్రమ్
రమా వక్షసం రమ్యరూపాభిరామం మహావిష్ణు మధ్యం భజే దత్తదేవమ్ ||
శ్రీ శివదత్తులు
శ్లో|| హరి బ్రహ్మణోరాననాభ్యాం షడంసం లలాటేక్షణం చన్ద్ర ఖణ్డావతంసమ్
భవానీసమేతం విభూతి ప్రభాఙ్గం మహాదేవ మధ్యం భజే దత్త దేవమ్ ||
శ్లో|| త్రిమూర్తి వదనోజ్వలం త్రిభుజ యుగ్మ సంశోభితం
చతుశ్శునక సంవృతం విమల ధర్మధేను శ్రితమ్
ధరావలయ సంచరం చరణపాదుకా ఘట్టనం
మహర్షి కుల నాయకం నమత దత్తదేవం గురుమ్ ||
తా|| త్రిముఖములతోను, షడ్భుజములతోను, నాలుగు శునకములచేత సేవించబడుచు ధర్మధేనువుచే ఆశ్రయించ బడినటువంటిన్ని భూమి నంతయు సంచరించునట్టి వారును, పాదుకలు శబ్దము చేయుచుండు నట్టి వాడును, మహర్షుల కులనాయకుడైన శ్రీ గురుదత్త దేవుని నమస్కరించండి.
శ్రీ వారికి వినతి
శ్లో|| నైవాష్ట సిద్ధిం న చ వాஉత్ర కీర్తిం నా పి త్వదీయాం పదవీం వృణోమి
వృణో మ్యహం జన్మని జన్మనీహ శ్రీ దత్త ! తే పాద సరోజ సేవామ్ ||
తా|| అష్ట సిద్ధులను కానీ, ఈ లోకములో కీర్తిని గానీ, నీతో సమానమైన కైవల్య పదవిని కానీ కోరుటలేదు. ఓ శ్రీ దత్తా ! ప్రతి జన్మలోను నీ పాద పద్మసేవనే కోరుచున్నాను.
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః