home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ దత్త చరణ మాల


శ్రీ దత్త దేవం శిరసా నమామి (పల్లవి)

శ్రీ దత్తదేవం శిరసా నమామి - గురుదత్తదేవం వచసాభజామి |

ప్రభుదత్తదేవం మనసా స్మరామి - శ్రీ దత్త దేవం శిరసా నమామి ||

 

ఓంకార మంత్రార్ధ పరమాత్మ తత్త్వం - నిర్గుణ బ్రహ్మైవ గుణరూప మాద్యమ్ |

అత్రి తపః ఫల దత్త మాత్రేయం - అనసూయా గర్భ వరవత్స రూపమ్ |

బ్రహ్మ విష్ణు శివ వదనత్రయాబ్జం - వాణీశ లక్ష్మీశ గౌరీశ మేకమ్ |

కోటిత్రయ సుర వట తరుమూలం - శంఖ చక్ర యుగ వైష్ణవ హస్తమ్ |

ఢమరు త్రిశూలక శంకరపాణిం - మాలా కమండలు బ్రహ్మకరాబ్జమ్ |

కాషాయ కౌశేయ కమనీయ చేలం - కటి తట పాదాంత పీతాంబరంతమ్ |

మేఖలార్ధోరుక శార్ధూలకృత్తిం - శునకాయిత చతురామ్నాయ పాదమ్ |

రక్షార్ధ మాశ్రిత గోరూప ధర్మం - కార్త వీర్యార్జున సామ్రాజ్యమూలమ్ |

పరశురామ శిష్య పరమాచార్యం - శంకరాచార్య చండాలవేషమ్ |

యోగీశ్వర యొగిరాజైక వాచ్యం - కరతలామలకాణి  మాద్యష్ట సిద్ధిం |

విష్ణుదత్త స్త్రోత్ర పరమానందం - సృష్ట్యాది సృష్ట్యంత నిత్యావతారం |

గణపతిపరూపం స్కంద స్వరూపం - మణికంఠ రూపం మారుతి రూపం |

రామకృష్ణ వీరభద్ర స్వరూపం - కాళికా రాజేశ్వరీ శక్తి రూపం |

శ్రీ విద్య యంత్ర మంత్రాది బోధం - ఆదిత్యాది నవగ్రహాకారం |

ఓంకార హృదయస్ధ గ్రహపతి భానుం - ఐం బీజ  శంఖస్ధ  పూర్ణేందు బింబం |

క్రోం బీజచక్రస్ధ కుజగ్రహంతం - క్లీం బీజ ఢమరుక స్ధిత బుధకేటం |

క్లూం బీజ జలపాత్ర గురుగ్రహంతం - హ్రాం బీజపదామ శుక్రగ్రహంతం |

హ్రీం బీజ  శూలస్థ శనైశ్చరంతం - హ్రూం బీజవామాంఘ్రి కేతుగ్రహంతం |

సౌరితి దక్షిణ పాదస్థ రాహుం - దత్తాత్రేయాయ నమ ఇతి పూర్ణం |

శ్రీ పాద నృసింహ సమర్ధ గురు రూపం - మాణిక్య ప్రభు సాయిస్వరూపం |

సర్వ మత దేవతా సాధు జన రూపం  - కలియుగే చిత్రాణి ప్రదర్శయంతం |

విశ్వరూపే మధ్య వదనత్రయేక్ష్యం - స్మార్త  వైష్ణవ  శైవ  సర్వైక దేవం |

గురుశబ్ద తాత్పర్య పర్యవసానం - వేదశాస్త్ర  ఙ్ఞాన పండిత రాజం |

గురుశిష్య సంప్రదా యాదాచార్యం - ధీ ప్రచోదక గురు గాయత్ర్యర్ధం |

మతత్రయాచార్య సిద్ధాంత మూలం - గురు చతుర్వింశతి తత్త్వయదుబోధం |

వేదాంత శాస్త్ర ప్రధమాచార్యం - మునిసురాణామపి పరీక్షకంతమ్ |

సృష్టి స్ధితి ప్రళయ కారి త్రివక్త్రం - అష్ట సిద్ధికర మష్టై శ్వర్య దానం |

 

ఆయురారోగ్య సంతాన వరదనం - దివ్య మంగళశోభి వరదాన మూర్తిం |

 

జిహ్వాగ్రవక్ష శ్శరీరార్ధ శక్తిం - విద్యా మహైశ్వర్య మహిమ ప్రదానం |

అష్ట సిద్ధి ప్రదానైకాధికారం - పరుశురామ చిత్త శాంతి ప్రదానం |

జన్మ రహితమత ఏవదత్తాఖ్యం - దత్త పుత్ర్రాయిత నిజ భక్తవత్సం |

దేవతానామేవ దావతా స్థానం - కోటీ త్రయస్త్రింశ దేవత్రిమూర్తిం |

పరమహంసారాధ్య దిగంబరాంగం - సన్యాసి మోక్షార్ధ మవధూతరూపం |

వాంఛిత వరదాన షడ్భుజమూర్తిం - ధనసుతాది వరద త్రిముఖస్వరూపం |

భక్తి  మార్గేణైవ కేవలసాధ్యం - నిర్గుణం సర్వగుణ భూతావతారం |

ఙ్ఞానినం యోగినం వేద కర్మిష్టం - భక్త పరీక్షార్ధ మాయావిరూపం |

చిత్ర విచిత్ర కలియుగ లీలం - సాక్షాత్పరబ్రహ్మ శబ్దార్ధమేకం |

బ్రహ్మతేజో దివ్య సౌందర్య రూపం - నవకోటి మన్మధ లావణ్యాంగం |

త్రితిలక కుంకుమ భస్మోర్ధ్వ పుండ్రం - బ్రహ్మచారిణమాది బ్రహ్మర్షి విప్రం |

ఆచార హీనం సదాచార వంతం - కర్తుమకర్తుం వికర్తుం సమర్ధం |

పరశురామాయైవ కర్మాచార్యం - మధుపాన మత్తం నమూఢైర్దృష్టం |

సర్వ మంత్ర సిద్ధి ప్రదవామముష్టిం - విష్ణు దత్త శ్రాద్ధ నిమంత్రిత విప్రం |

కాశీపురస్నాన కరవీరసాంధ్యం - మాహురీపురభైక్ష్య సహ్యాద్రినిద్రం |

గోరక్షనాధాయ దత్తగురుగీతం - ప్రహ్లాదభక్తాయ ముక్తి ప్రదానం |

మేరుదక్షిణ పీఠ ఖేచరీముద్రం - వక్షస్స్థలోద్భసి యఙ్ఞోపవీతం |

కాలజటాబంధ కేశకిరీటం - స్ఫటికదామ తులసీ రుద్రాక్షహారం |

మందారకుందాతసీపుష్ప మాలం - వేదశునకాఘ్రాత పాదుకాపాదం |

చరణాంచిత కమల శంఖచక్రాంకం - బ్రహ్మ ముఖ రసనాగ్ర భారతీనృత్యం |

వక్షస్థలస్థిత లక్ష్మీవిలాసం - రుద్రముఖవామార్ధ పార్వతీహాసం |

యదుయాచనా యదు వంశావతీర్ణం - పింగళనాగాయ శంకర రూపం |

ఇంద్రాయజంభాంతకరలక్ష్మీశం - బదరికావనసిద్ధ బ్రహ్మ స్వరూపం |

అలర్క శిష్యాయ మాయావధూతం - శీలాఖ్య విప్రాయ సశునకవిప్రం |

శ్యామారుణధవల మిశ్రమ వర్ణం - భక్తి వాత్సల్యేన దత్తసాయుజ్యం |

ఆదిశేషేణాపి వక్తుమశక్యం - బృహస్పతినాపి బోద్ధుమశక్యం |

శ్రీ దత్తదేవం శిరసా నమామి - గురుదత్తదేవం వచసా భజామి |

ప్రభుదత్తదేవం మనసా  స్మరామి - శ్రీ దత్త దేవం శిరసా నమామి ||

 
 whatsnewContactSearch