home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ దత్త స్తోత్ర మాల


శ్రీ దత్త గణపతి
1. శ్రీ మూషికన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల ధౌత దంతాయతే |
చారునృత్యాయతే విఘ్నరాజాయతే - శ్రీ పార్వతీ ప్రాణ పుత్రాయ వందనమ్ |
సిద్ది బుద్ధి ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ వీరభద్రుడు
2. దక్షక్రతున్యస్ధ పాద పద్మాయతే  - వామహస్తాలోల తీక్ష్ణ ఖడ్గాయతే |
శ్మశృవక్త్రాయతే వీరభద్రాయతే - శ్రీ కాళికా ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ షణ్ముఖుడు
3. క్రౌంచాచలన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల శక్తి భల్లాయతే |
షణ్ముఖాబ్జాయతే తారకాంతాయతే -వల్లీశ్వరీ ప్రాణ నాధాయ వందనమ్ ||

ఈశ్వరుడు
4. శ్రీ శైల విన్యస్త పాద పద్మాయతే  - వామహస్తాలోల కాలశూలాయతే |
ఫాలనేత్రాయతే భస్మవక్త్రాయతే  - భ్రమరాంబికా ప్రాణనాధాయ వందనమ్ ||

మణికంఠుడు
5. శబరి గిరిన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల మంత్ర మాలాయతే |
హరిహరాంశాయతే సుమణి కంఠాయతే - శ్రీ మోహినీ ప్రాణ పుత్రాయ వందనమ్ ||

శ్రీ వేంకటేశ్వరుడు
6. సపశైలన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల కేళి పద్మాయతే |
పద్మ నేత్రాయతే పద్మ వక్త్రాయతే - పద్మాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ సూర్యభగవానుడు
7. ప్రాచీదిశిన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల శుక్ల వేదాయతే |
అరుణ బింబాయతే సూర్యదేవాయతే  - ఛాయాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ కృష్ణుడు
8. గోవర్ధనన్యస్త పాద పద్మాయతే  - వామహస్తాలోల చక్ర వేగాయతే |
మకుట పింఛాయతే మధుర వంశాయతే  - రాధా సతీ ప్రాణనాధాయ వందనమ్ ||

శ్రీ రాముడు
9. సాకేత విన్యస్త పాద పద్మాయతే  - వామహస్తాలోల చారు చాపాయతే |
సత్య వాక్యాయతే ధర్మ రూపాయతే  - సీతా సతీ ప్రాణనాధాయ వందనమ్ ||

శ్రీ హనుమంతుడు
10. ఆకాశ విన్యస్త పాద పద్మాయతే  - వామహస్తాలోల భూరి శైలాయతే |
రామ కార్యాయతే భీమ వీర్యాయతే - సువర్చలా ప్రాణ నాధాయ వందనమ్||

అగ్నిదేవుడు
11. యజ్ఞాంతరన్యస్త పాద పద్మాయతే  - వామ హస్తాలోల హోమ పాత్రాయతే |
సప్త జిహ్వాయతే ద్రవ్య వాహాయతే  - స్వాహా సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ దేవేంద్రులు
12. ఐరావతన్యస్త పాద పద్మాయతే  - వామహస్తాలోల హేతివజ్రాయతే |
స్వర్గ నాధాయతే దేవరాజాయతే  - శచీ సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ ఆదిశేషుడు
13. క్షీరార్ణవన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల నాగపాశాయతే |
విష్ణు తల్పాయతే శేష దేవాయతే  - శ్రీ నాగినీ ప్రాణ నాధాయ వందనమ్ ||

గరుత్మంతుడు
14. వైకుంఠ విన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల పూర్ణ కుంభాయతే |
విష్ణు వాహాయతే గరుడ రాజాయతే - వినతాంబికా ప్రాణ పుత్రాయ వందనమ్ ||

శ్రీ కాలభైరవులు
15. బ్రహ్మాండ విన్యస్త పాద పద్మాయతే  - వామహస్తాలోల కాల పాశాయతే |
దత్త దూతాయతే భైరవాఖ్యాయతే  - మాయాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

 శ్రీ దత్తాత్రేయస్వామి
16. సహ్య శైలన్యస్త పాదపద్మాయతే - వామహస్తాలోల బీజమాలాయతే |
అరుణవస్త్రాయతే యోగిరాజాయతే  - అనఘా సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ షిరిడీ సాయి నాధుడు
17. శ్రీ షిరిడి విన్యస్త పాద పద్మాయతే  - వామహస్తాలోల లోహ దండాయతే |
మౌళి వస్త్రాయతే సాయినాధాయతే  - శ్రీ ద్వారకామాయి వాసాయ వందనమ్ ||

శ్రీ సత్యసాయి నాధుడు
18. శ్రీ పర్తి విన్యస్త పాదపద్మాయతే  - వామహస్తాలోల భస్మదానాయతే |
కేశ బింబాయతే మధుర కంఠాయతే - శ్రీ సత్యసాయీశ దేవాయ వందనమ్ ||

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
19. మైసూరు విన్యస్త పాద పద్మాయతే - వామహస్తాలోల యోగ ముద్రాయతే |
భక్తి గీతాయతే దత్త తత్త్వాయతే - శ్రీ సచ్చిదానంద దేవాయ వందనమ్ ||

విజయపురిన్యస్త పాదపద్మాయతే  - వామహస్తాలోల వేద శాస్త్రాయతే |
ఙ్ఞాన సూర్యాయతే దత్తరూపాయతే - శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనమ్ ||
సర్వ విశ్వన్యస్త పాదపద్మాయతే - వామహస్తాలోల వేదశాస్త్రాయతే |
ఙ్ఞాన సూర్యాయతే దత్తరూపాయతే -శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనమ్ ||

 
 whatsnewContactSearch