కామయే కాలాగ్ని శమనం
కాలకాలం కరుణాల వాలం కాలభైరవం || (పల్లవి)
1. మాయాజాలం - మదిరాలోలం |
మునిజనపాలం - మహాభీకర శూలం ||
2. పింగళజటా జూటం - పాదోద్ధావిత ఖేటం |
గర్జనోజ్జ్వల విస్ఫోటం - ప్రస్ధానమహార్భాటం ||
3. శిరశ్చంద్ర ఖండం - ఫాలాగ్ని కుండం |
భ్రామిత కాలదండం - కంపమాన జగదండం ||
4. దేహోద్ధత జ్వాలా చండం, క్రోధపిండం, భస్మీకృత భువనభాండం ||