home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

గురు దత్త పాహిమామ్


గురుదత్త, శ్రీ దత్త, ప్రభుదత్త పాహిమామ్
విధి దత్త, హరిదత్త , హరదత్త, రక్షమామ్ ||

1. త్రిముఖాని షట్పాణి కమలాని బిభ్రాణ !
శ్రుతి  స్సారమేయై స్సమావృత్త  పాద పద్మ! ||

మూడు ముఖములను ఆరు పాణి కమలమును ధరించిన వాడా! కుక్కలైన నాలకుగు వేదములచే చుట్టబడిన పాదపద్మములను కలవాడా!

2. వాణీశ, లక్ష్మీశ, గౌరీశ జగదీశ |
షట్ఛాస్త్ర  దివ్యాస్త్ర వేదాంత శాంతికర ||

ఓ వాణీపతీ! లక్ష్మీపతీ! గౌరీపతీ! జగత్పతీ! ఆరు శాస్త్రములను దివ్యాస్త్రములచే కూడిన వేదాంత శాస్త్ర బోధ ద్వారా శాంతిని ఇచ్చెడివాడా!

3. ఙ్ఞాన ప్రచారార్ధ మవ తీర్ణ నరరూప |
వేద ప్రమాణ ప్రదీప ప్రవచనార్ధ ||

జ్ఞాన ప్రచారమునకు నర రూపములో అవతరించిన వాడా! వేదప్రమాణము అను దీపముతో కూడిన ప్రవచనమును చేయుచున్నవాడా!

4. మందహాసానంద నిష్యంద మధు బృంద |
కదర్ప సందోహ సౌందర్య ! వందనమ్ ||

మందహాసమునందున్న ఆనందముతో నుండి వర్షించుచున్న మకరంద ధారలు కలవాడా! అనేక మన్మధుల యొక్క సౌందర్యము కలవాడా! నీకు వందనము.

 
 whatsnewContactSearch