నమో నమో గురు దత్తాయ - బ్రహ్మ జ్ఞాన విత్తాయ
అఫల ప్రేమోన్మత్తాయ - కరుణా రసభర చిత్తాయ|| (పల్లవి)
1. శంఖ చక్ర ఢమరుక శూల
కుండీమాలాధారిణే మనోహారిణే
త్రిభువన సంచారిణే కుమతి జన సంహారిణే
సహ్యాచల విహరిణే జగత్కారిణే||
2. సనక సనందన సనత్కుమార
సనత్సుజాతాఖ్య - చతురాగమ సారమేయాయ
తర్కామేయాయ - ముని మనోనేయాయ
పరమ ధ్యేయాయ-సుందర కాయాయ
యోగి నాయకాయ||
3. జీవోద్ధారకాయ - మాయా తారకాయ
ధిషణా ప్రేరకాయ - జ్ఞాన కారకాయ
దైత్య మారకాయ - విపన్ని వారకాయ||