home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

పంచ గేహినాం భిక్షయాచరం


పంచ గేహినాం భిక్షయా చరమ్ – శిర్డీసాయినం దత్తమాశ్రయే ।।

సాక్షాత్తూ దత్తావతారమైనటువంటి, కేవలం ఐదుగురు భక్తుల ఇళ్ళలో మాత్రమే భిక్షను స్వీకరించేటటువంటి, శ్రీ శిర్డీ సాయిబాబా పవిత్ర పాద పద్మములను నేను ఆశ్రయిస్తున్నాను.

 

అరుణవాససం కేశమణ్డలమ్ - సత్యసాయినం దత్తమాశ్రయే ।।

సాక్షాత్తూ దత్తావతారమైనటువంటి, ఎల్లపుడూ కాషాయ వస్త్రములను ధరించి ప్రత్యేకమైన శిరోజాలంకరణతో శోభించేటటువంటి శ్రీ సత్య సాయిబాబా పవిత్ర పాద పద్మములను నేను ఆశ్రయిస్తున్నాను.

 

అభయదాయకం సటకధారిణమ్ - శిర్డీసాయినం దత్తమాశ్రయే ।।

తనను ఆశ్రయించిన భక్తులకు అభయాన్నిచ్చి కాపాడేటటువంటి, చేతిలో ‘సటక’ అనే పరికరాన్ని ధరించినటువంటి శ్రీ శిర్డీ సాయిబాబా పవిత్ర పాద పద్మములను నేను ఆశ్రయిస్తున్నాను.

 

హస్తచాలనాత్ భస్మవర్షిణమ్ - సత్యసాయినం దత్తమాశ్రయే ।।

చేతినూపి పవిత్ర భస్మమును వర్షముగా కురిపించి, అటువంటి అనేక మహిమలను చేసిన శ్రీ సత్య సాయిబాబా పవిత్ర పాద పద్మములను నేను ఆశ్రయిస్తున్నాను.

 

శిర్డీవాసినం సిద్ధయోగినమ్ - శిర్డీసాయినం దత్తమాశ్రయే ।।

మహారాష్ట్రలోని చిన్న గ్రామమైన షిర్డీలో ఉంటూ సిద్ధయోగిగా ప్రఖ్యాతి పొందిన శ్రీ శిర్డీ సాయిబాబా పవిత్ర పాద పద్మములను నేను ఆశ్రయిస్తున్నాను.

 

పర్తివాసినం పరమపావనమ్ - సత్యసాయినం దత్తమాశ్రయే ।।

పరమ పావనులైనటువంటి, పుట్టపర్తిలో నివసించి భక్తులను అనుగ్రహించినటువంటి శ్రీ సత్య సాయిబాబా పవిత్ర పాద పద్మములను నేను ఆశ్రయిస్తున్నాను.

 
 whatsnewContactSearch