తక్కువేమి మనకు - శ్రీ దత్తుడొక్కడుండు వరకు (పల్లవి)
చాకలినే నరపతిగా చేసిన
శ్రీపాద వల్లభ శ్రీకృప యుండగ॥
శూలపాణియై దొంగల చంపిన
శ్రీపాద శివుడు అండగ నుండగ॥
వట్టిగేదెను క్షీరదాయిగ
చేసిన శ్రీ నరహరి మనకుండగ॥
పిడికెడు బియ్యము వేల భోజనముగ
వండిన శ్రీ నరసింహుడుండగ॥
తన మలమునే హేమముగ మార్చిన
శ్రీ మాణిక్య ప్రభువు మనకుండగ॥
సటకా కొట్టుచు యమునే తరిమిన
శ్రీ షిరిడి సాయి మన వెంట నుండగ॥
వేలాది మహిమల చూపుచు
బోధక శ్రీ సత్యసాయి మన చెంతనుండగ॥
త్రిలోక దుర్లభ బ్రహ్మ జ్ఞానదుడు
శ్రీ దత్తస్వామి మనతో నుండగ॥
(ఫలశ్రుతి: నిరాశ దూరమై, ఉత్సాహం కలుగుతుంది.)