శ్లో॥ అవతీర్ణనరో బ్రహ్మ। మార్గః కర్మ కర్మ ఫలార్పణం।
జీవః సృష్టి కణః సృష్టిః। మిధ్యా తస్యైవ నాత్మనః॥
తా॥ అవతరించిన నరావతారమే బ్రహ్మము. ఆ బ్రహ్మమును ప్రసన్నము చేసుకొను మార్గము కర్మము మరియు కర్మ ఫలము యొక్క సమర్పణమే. జీవుడు సృష్టి లోని ఒక అత్యల్పమైన కణము. ఈ సృష్టి బ్రహ్మమునకే మిధ్య కానీ, జీవునకు కాదు.