వేదాంతమును వినుమా । నాదాంతమును కనుమా।
మోదాంతమన్న ఇదియే । ఖేదాంతమన్న అదియే॥
ఊహకందనిదే పరబ్రహ్మము । జీవతారణమున కవతరించె।
ఉన్నదన్నచో ఊహకందేను। లేనిదన్నచో ఉన్న అనూహ్యము॥
తెలుసునన్నచో తెలియని వాడు । తెలియదన్నచో తెలిసినవాడు।
ఊహకందనిదే కనిపించును । కంట జూచియును తెలియగలేవు॥
పరబ్రహ్మమే ఆ భగవంతుడు । భగవంతుడే ఆ పరబ్రహ్మము।
శ్రీదత్తుడే ఆ భగవంతుడు । ఆ భగవంతుడే శ్రీ దత్తుడు॥
గుర్తుపట్టుట నీకు సాధ్యమా? ఆయన మాయలో మునులే పడిరి।
సుఖము నిచ్చిన అందరు వత్తురు । కష్టముల నిచ్చిన పారిపోవుదురు॥
అగ్ని పరీక్షలో ప్రేము తేలును । నేను కావలెనో ఆస్తి కావలెనో।
నన్ను చేరిన కష్టము వచ్చును । నన్ను వదలిన సుఖము కల్గును॥
ఇహము చెడిపోవు । ముక్తిని నీయబోను।
సుఖము చెడు । దుఃఖము లభించు । సున్న అంతము॥